Vande Bharat Train AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే విశాఖ, సికింద్రాబాద్ ల మధ్య ఒకటి, తిరుపతి, సికింద్రాబాద్ ల మధ్య మరోకటి తిరుగుతోంది. తాజాగా మూడో వందేభారత్ రైలు అందుబాటులోకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వే శాఖ సన్నహాలు పూర్తిచేసింది. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఐదు వందేభారత్ రైళ్లను పర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అందులో భాగంగా చెన్నై, విజయవాడ మధ్య వందేభారత్ రైలును ఈ నెల 7న జాతికి అంకితం చేయనున్నారు. జూలై 8 నుంచి రైలు పూర్తిస్థాయిలో రాకపోకలు సాగించనుందని దక్షిణ మధ్య రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు.
ఈ రైలు విజయవాడ మీదుగా గూడురు, రేణిగుంట, కాట్పాడి మీదుగా చెన్నై చేరుకోనుంది. తిరుపతి భక్తల రద్దీని దృష్టిలో పెట్టుకొని రేణిగుంట మీదుగా తిప్పాలన్న అధికారుల సూచనలను రైల్వేశాఖ పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే వందేభారత్ రైలుకు ఏయే స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది, రాకపోకల షెడ్యూల్, టిక్కెట్ ధరలు, ప్రయాణ సమయం వంటి షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు.
మోడీ వచ్చాక టెక్నాలజీకి ప్రాధాన్యత పెరిగింది.. 4జీ నుంచి 5జీకి వచ్చింది. ఇక జనాల అవసరాన్ని గుర్తించిన మోడీ సర్కార్ మన మూస బ్రిటీష్ వారి కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునీకరించింది. ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ అంటూ ఆధునిక ట్రెయిన్ లను ప్రవేశపెట్టింది. గత ఏడాది సెప్టెంబర్ 30న తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ముంబై టు గుజరాత్ లోని గాంధీనగర్ కు ఈ సెమీ హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టారు. ఈ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ గాంధీనగర్ నుంచి కాలుపూర్ రైల్వే స్టేషన్ వరకూ ప్రయాణించారు. ఇండియన్ రైల్వేలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా వందేభారత్ రైళ్ల సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించారు.