
ఎట్టకేలకు తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల రిజల్ట్స్ వచ్చాయి. రెండు పట్టభద్రుల స్థానాలనూ టీఆర్‌ఎస్ పార్టీనే తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయ బావుటా ఎగురవేశారు. ఇక వరంగల్–నల్లగొండ–ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. అయితే.. ఈ రెండింటిలో ఏదో ఒక సీటుపై కాస్త టీఆర్‌ఎస్‌కు నమ్మకం సన్నగిల్లినా చివరికి రెండు స్థానాలను కైవసం చేసుకుంది.
ఒకవిధంగా చెప్పాలంటే హైదరాబాద్ సీటుపై టీఆర్‌ఎస్‌కు ముందు నుంచీ పెద్దగా నమ్మకం లేదు. కానీ.. జరిగిన అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే.. అది కేవలం కేసీఆర్ రాజకీయ వ్యూహమే అనేది చాలా మందికి తెలియదు. ఈ సీటుపై టీఆర్‌ఎస్ అధినేతకు సైతం నమ్మకం లేకపోవడంతో ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ నమ్మకం కలగకనే చివరి వరకు కూడా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేకపోయారు. అభ్యర్థిని పెట్టాక ఓడిపోతే ఉన్న కాస్త పరువు కూడా పోతుందని భావించారు. అందుకే ఒకానొక సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అప్పటికే నల్లగొండ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌కు బీఫాం కూడా ఇచ్చేశారు. ఆయన ప్రచారం రంగంలో దూసుకెళ్తున్నారు.
Also Read: తెలంగాణ బీజేపీకి షాక్.. మళ్లీ మొదటికి వ్యవహారం
కానీ.. హైదరాబాద్ అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు. దీంతో ఇక ఆ సీటును టీఆర్‌ఎస్ వదులుకున్నట్లేనని అందరూ అనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ బరిలో దిగకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. కానీ.. నామినేషన్ల ప్రాసెస్ ముగిసే రెండు రోజుల ముందు అనూహ్యంగా కేసీఆర్ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. ఎవరూ ఊహించని రీతిలో ఆకస్మాతుతగా పీవీ కుమార్తెకు టికెట్ ఇచ్చి ఖంగుతినేలా చేశారు. అప్పటికే ఆమెతో చర్చించిన కేసీఆర్.. గెలుపు హామీని సైతం ఇచ్చారు. అనుకున్నట్లుగానే ప్రచారంలోకి దిగారు. సురభి వాణీదేవిని అభ్యర్థిగా నిలబెట్టడంతో బీజేపీ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
ఇందుకు కారణం కూడా లేకపోలేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పట్టభద్ర ఓటర్లు బ్రాహ్మణ సామాజికవర్గం వారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కూడా అదే సామాజికవర్గం. అందుకే తన గెలుపునకు ఢోకా ఉండదని ఆయన విశ్వాసం. అయితే.. అదే సామాజికవర్గానికి చెందిన పీవీ కుమార్తెను రంగంలోకి దించడం ప్రధాని స్థాయిలో పనిచేసిన ఆయన కుమార్తెకు ఓటు వేయకుండా ఆ సామాజికవర్గం ఎలా ఉంటుదనే ఆలోచన రావడంతో.. బీజేపీకి కూడా చెమటలు పట్టాయి. అందుకే ఎప్పుడూ లేని విధంగా బహిరంగంగా బ్రాహ్మణ కార్డును ఉపయోగించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
పీవీ కుమార్తెను నిలబెట్టినా.. బ్రాహ్మణ ఓట్లన్నీ తనకే పడతాయని ప్రచారం చేసుకున్నారు. కొంత వరకూ పడ్డాయేమో కానీ.. పూర్తిస్థాయిలో పడలేదు. ఫలితాలు చూసి బీజేపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. కేసీఆర్ రాజకీయ వ్యూహాల ముందు సరితూగలేమని వారికి తేలిపోయింది. పట్టభద్రులు తెలంగాణ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి అదే పరిస్థితి. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎప్పుడూ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గెలిచారు. గతంలో రామచంద్రరావు గెలిచారు. పల్లా ఒక్కరు మాత్రం గతంలో గెలిచారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ తన చాణక్య ప్రదర్శనతో మరోసారి టీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడింది. అందుకే.. దటీజ్ కేసీఆర్ అని మరోసారి అంటున్నారు.