తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. నాలుగో రోజు ఓట్ల లెక్కింపు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. బుధవారం లెక్కింపు ప్రారంభమైనా.. శనివారం వరకు కూడా ఇంకా గెలుపుపై క్లారిటీ రాలేదు. హైదరాబాద్‌–-రంగారెడ్డి–-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుండగా, వరంగల్‌–-ఖమ్మం–-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. Also Read: మళ్లీ లాక్ డౌన్..? తెలంగాణలో […]

Written By: Srinivas, Updated On : March 20, 2021 10:20 am
Follow us on


తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. బుధవారం లెక్కింపు ప్రారంభమైనా.. శనివారం వరకు కూడా ఇంకా గెలుపుపై క్లారిటీ రాలేదు. హైదరాబాద్‌–-రంగారెడ్డి–-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుండగా, వరంగల్‌–-ఖమ్మం–-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Also Read: మళ్లీ లాక్ డౌన్..?

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలుపునకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే రెండో ప్రాధాన్యతలో కూడా ఎవ్వరికీ స్పష్టతమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోతే ఎక్కువ ఓట్ల వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పెరిగిన పోలింగ్‌తో పాటు జంబో బ్యాలెట్‌తో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పెరిగిన పోలింగ్‌తోపాటు జంబో బ్యాలెట్‌తో కౌంటింగ్ సవాల్‌గా మారింది. దీంతో ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు సమయం పడుతుందని భావించినా ఇంకా కొనసాగుతోంది. కాగా, మూడు షిప్టుల్లో ఓట్లను లెక్కిస్తున్నారు.

కౌంటింగ్‌ కోసం ఒక్కో హాలులో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రతీ రౌండ్‌లో ఒక్కో టేబుల్‌కు 1000 చొప్పున 56 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్‌ చేశాక, ఒక్కో టేబుల్‌కు 1000 ఓట్లు (40) బండిళ్లు ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌లో 56 వేల ఓట్లను లెక్కించనుండగా, మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. తుది ఫలితం తేలడానికి ఇంకా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు చెబుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 86 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌ అయ్యారు. 8,478 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఉన్నారు. ఫలితాలు వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

Also Read: దేశం మొత్తం చూడాలంటున్న జగన్ ప్లాన్ ఇదీ

హైదరాబాద్‌-–రంగారెడ్డి–-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో స్పష్టత రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి 1,15,043 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,06,565 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ. నాగేశ్వర్‌కు 55,742, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 32,879 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో 86 మంది ఎలిమినేషన్‌ అయ్యారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ అభ్యర్థికి వాణీ దేవికి 232 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావుకు 217 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 137 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 115 ఓట్లు జమయ్యాయి.

హైదరాబాద్‌–-రంగారెడ్డి–-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటివరకు 49 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. నల్లగొండ– వరంగల్‌– ఖమ్మం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 55 మంది ఎలిమినేషన్ అయ్యారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్