spot_img
Homeజాతీయ వార్తలుTelangana MLC Elections Results: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ దూకుడు.. ఆస‌క్తిక‌రంగా కౌంటింగ్‌..

Telangana MLC Elections Results: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ దూకుడు.. ఆస‌క్తిక‌రంగా కౌంటింగ్‌..

Telangana MLC Elections Results: తెలంగాణ‌లో ఆస‌క్తిక‌రంగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 8 గంటలకు మొద‌లు పెట్టారు ఆఫీస‌ర్లు. కాగా ఈ కౌంటింగ్ ఖమ్మం, కరీంనగర్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాల్లో కొన‌సాగుతోంది. ఈ నెల 10వ తేదీన పోలింగ్ ముగిసింది. ఆరు స్థానాల‌కు ఈ కౌంటింగ్ జ‌రుగుతోంది. ఇక పోలైన ఓట్ల‌ను లెక్కించేందుకు ఐదు చోట్ల కౌంటింగ్ కేంద్రాల‌ను నిర్వ‌హిస్తున్నారు అధికారులు. ఇక త్వ‌ర‌గానే ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే ఛాన్స్ క‌నిపిస్తోంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల్లోపు రిజ‌ల్ట్ వ‌చ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది.

Telangana MLC Elections Results
Telangana MLC Elections Results

ఇక రాష్ట్ర మంతా ఎంతో ఆస‌క్తిగా చూస్తున్న స్థానం ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌. ఇక్క‌డ గులాబీ పార్టీ నుంచి ఎల్ రమణ అలాగే భాను ప్రసాదరావు బ‌రిలో ఉన్నారు. ఇక ఇండిపెండెంట్ గా మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఉన్నారు. ఇక్క‌డ మొద‌టి నుంచి కాస్త పోటీ ఉంది. బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఇక్క‌డ ర‌వీంద‌ర్ సింగ్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. దాంతో ఇక్క‌డ ఏం జ‌రుగుతుందో అని అంతా ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఇక ఒమిక్రాన్ నేప‌థ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు ప‌ర్మిష‌న్ లేదు. క‌రీంన‌గ‌ర్ ఓట్ల‌ను ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో లెక్్కిస్తున్నారు. 1,320 ఓట్లను లెక్కిస్తున్నారు. ఇక న‌ల్గొండ జిల్లా విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ కౌంటింగ్‌ను మహిళా శక్తి సమాఖ్య భవన్‌లో నిర్వ‌హిస్తున్నారు. నాలుగు టేబుళ్ల మీద ఓట్ల‌ను లెక్కిస్తారు. ఇక్క‌డ ప్రతి టేబుల్‌కు ఒక సూపర్ వైజర్ తో పాటుగా నలుగురు అధికారులు ఉంటారు. ఒక్కో టేబుల్ మీద దాదాపు 200 ఓట్లను లెక్కిస్తారు.

Also Read: KCR-Stalin: కేసీఆర్, స్టాలిన్.. పాత దోస్తీ పునరుద్ధరణ సాధ్యమేనా?

న‌ల్గొండ‌లో 1,233 ఓట్లు లెక్కిస్తారు. ఇక్క‌డ టీఆర్ ఎస్ త‌ర‌ఫున కోటిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నగేష్ ఉన్నారు. ఇక మెద‌క్ విష‌యానికి వ‌స్తే వంటేరు యాదవరెడ్డి బ‌రిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి స‌తీమ‌ణి నిర్మల జగ్గారెడ్డి బ‌రిలో దిగారు. ఇక్క‌డ ఇండిపెండెంట్ గా మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా లెక్కింపులో మాత్రం టీఆర్ ఎస్ చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. క‌రీగ‌న‌గ‌ర్ లో కూడా టీఆర్ ఎస్ కే ఎక్కువ ఓట్లు పోల‌వుతున్నాయి.

Also Read: Survey Report: సర్వే రిపోర్టు.. పుంజుకున్న టీడీపీ కానీ.. వైసీపీ గెలుస్తుందా అంటే?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Oktelugu Epaper