Telangana MLC Elections Results: తెలంగాణలో ఆసక్తికరంగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 8 గంటలకు మొదలు పెట్టారు ఆఫీసర్లు. కాగా ఈ కౌంటింగ్ ఖమ్మం, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీన పోలింగ్ ముగిసింది. ఆరు స్థానాలకు ఈ కౌంటింగ్ జరుగుతోంది. ఇక పోలైన ఓట్లను లెక్కించేందుకు ఐదు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక త్వరగానే ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల్లోపు రిజల్ట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక రాష్ట్ర మంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న స్థానం ఉమ్మడి కరీంనగర్. ఇక్కడ గులాబీ పార్టీ నుంచి ఎల్ రమణ అలాగే భాను ప్రసాదరావు బరిలో ఉన్నారు. ఇక ఇండిపెండెంట్ గా మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఉన్నారు. ఇక్కడ మొదటి నుంచి కాస్త పోటీ ఉంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇక్కడ రవీందర్ సింగ్‌కు మద్దతు తెలుపుతున్నారు. దాంతో ఇక్కడ ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ఇక ఒమిక్రాన్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్ లేదు. కరీంనగర్ ఓట్లను ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో లెక్్కిస్తున్నారు. 1,320 ఓట్లను లెక్కిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ కౌంటింగ్‌ను మహిళా శక్తి సమాఖ్య భవన్‌లో నిర్వహిస్తున్నారు. నాలుగు టేబుళ్ల మీద ఓట్లను లెక్కిస్తారు. ఇక్కడ ప్రతి టేబుల్‌కు ఒక సూపర్ వైజర్ తో పాటుగా నలుగురు అధికారులు ఉంటారు. ఒక్కో టేబుల్ మీద దాదాపు 200 ఓట్లను లెక్కిస్తారు.
Also Read: KCR-Stalin: కేసీఆర్, స్టాలిన్.. పాత దోస్తీ పునరుద్ధరణ సాధ్యమేనా?
నల్గొండలో 1,233 ఓట్లు లెక్కిస్తారు. ఇక్కడ టీఆర్ ఎస్ తరఫున కోటిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నగేష్ ఉన్నారు. ఇక మెదక్ విషయానికి వస్తే వంటేరు యాదవరెడ్డి బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి బరిలో దిగారు. ఇక్కడ ఇండిపెండెంట్ గా మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా లెక్కింపులో మాత్రం టీఆర్ ఎస్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. కరీగనగర్ లో కూడా టీఆర్ ఎస్ కే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయి.
Also Read: Survey Report: సర్వే రిపోర్టు.. పుంజుకున్న టీడీపీ కానీ.. వైసీపీ గెలుస్తుందా అంటే?