https://oktelugu.com/

Pushpa: ‘ఊ అంటావా మావ’ పాటకు అరియానా స్టెప్పులు.. నెట్టింట్లో వీడియో వైరల్​

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 14, 2021 / 12:59 PM IST
    Follow us on

    Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

    ఇటీవలే ట్రైలర్​  రిలీజ్​ కాగా.. స్టన్నింగ్​ విజువల్స్​తో ప్రేక్షకుల్లో అంచనాలు మించిపోయాయి. కాగా, మరోవైపు  సమంత డాన్స్ చేసిన ఊ అంటావా మావ పాట విడుదైలన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లిపోయింది. సౌత్​ ఇండియా చరిత్రలోనే ఫాస్టెస్ట్​ వ్యూస్​ రాబట్టిన పాటగా రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా సమంత హాట్​లుక్స్​కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా, బిగ్​బాస్​తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఆర్జీవీ బోల్డ్​ బ్యూటీ అరియానా గ్లోరీ ఈ పాటకు తనదైన స్టైల్​లో స్టెప్పులేసి అలరించింది. ఆ వీడియోను ఇన్​స్టా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

    అల్లు అర్జున్​- సుకుమార్​ కాంబోలో వస్తోన్న మూడో సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్​గా నటిస్తుండగా.. సునీల్​, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్నో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా డిసెంబరు 17న అలరించేందుకు సిద్ధమైంది.