
గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో మాట్లాడతామని వెళ్లి సొంత పనులు చూసుకుని వచ్చారు. ఇప్పుడు మంత్రులు కూడా తమ విహార యాత్రలు చేస్తూ ప్రజా సమస్యలను సాకుగా చూపుతున్నారనే వాదనలు వస్తున్నాయి. దీన్ని పట్టించుకోని మంత్రులు చీటికిమాటికి ఎందుకు ఢిల్లీ వెళుతున్నారనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. బీజేపీ ప్రతిష్టను దిగజార్చేందుకే టీఆర్ఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: Cinema Tickets: తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కొత్త జీవో.. కేసీఆర్కు థ్యాంక్స్ చెప్తూ చిరు ట్వీట్
పార్లమెంట్ సమావేశాలు ముగిసినా ఎందుకు మంత్రులు ఢిల్లీ వెళ్లారో వారికే అంతుచిక్కడం లేదు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే తీరు మంత్రులకు మాత్రం తెలియడం లేదా అని ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ మంత్రులకు తెలివి ఉందా లేదా అనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా తెలంగాణ మంత్రులంతా తమను అవమానించారని ఏవో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడంలో వారి నైజం ఏంటో అర్థమైపోతోంది.
ధాన్యం కొనుగోలుపై తెలంగాణ మంత్రులు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం చూస్తుంటే వారికి ఆలోచన శక్తి లేదనే తెలుస్తోంది. కేంద్ర మంత్రులను కలవకుండానే కేంద్రంపై నిందలు వేయడం వారికే చెల్లింది. కానీ తెలంగాణ మంత్రుల చేతగాని తనానికి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఢిల్లీ వెళ్లడం పని కాకుండా తిరిగి రావడమెందుకు అనే ప్రశ్నలు కూడా అందరిలో వస్తున్నాయి. దీనిపై వారు ఏం సమాధానం చెబుతారని నెటిజన్లు అడుగుతున్నారు.