https://oktelugu.com/

Uttar Pradesh Elections : కాబోయే ఉత్తర ప్రదేశ్ సీఎం ఆయనేనట.. వెల్లడించిన సర్వే!

Uttar Pradesh Elections : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారం సాధిస్తే చాలు.. పార్లమెంటులో పాగా వేయడానికి దారి దొరికినట్టే అని భావిస్తాయి జాతీయ పార్టీలు. ఇది చాలు.. ఆ రాష్ట్రం రాజకీయంగా ఎంతకీలకం అన్నది చెప్పడానికి. అలాంటి రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో.. అక్కడ గెలుపు జెండా ఎగరేసేది ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా.. జన్ కీ బాత్ నిర్వహించిన సర్వేలో.. 55 శాతం మంది […]

Written By:
  • Rocky
  • , Updated On : December 25, 2021 / 12:10 PM IST
    Follow us on

    Uttar Pradesh Elections : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారం సాధిస్తే చాలు.. పార్లమెంటులో పాగా వేయడానికి దారి దొరికినట్టే అని భావిస్తాయి జాతీయ పార్టీలు. ఇది చాలు.. ఆ రాష్ట్రం రాజకీయంగా ఎంతకీలకం అన్నది చెప్పడానికి. అలాంటి రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో.. అక్కడ గెలుపు జెండా ఎగరేసేది ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా.. జన్ కీ బాత్ నిర్వహించిన సర్వేలో.. 55 శాతం మంది ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ యోగీనే కొనసాగాలని కోరుకుంటున్నారట. మరి, ఆ వివరాలేంటో చూద్దాం…

    వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చిలో యూపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో.. 75 జిల్లాల నుంచి 20 వేల మందిని జన్ కీ బాత్ సర్వే చేసింది. ఈ అభిప్రాయ సేకరణలో బీజేపీకి 233 నుంచి 252 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలిందట. సమీప ప్రత్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ ఉంటుందని, ఆ పార్టీకీ 135 నుంచి 149 సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం దారుణ పరాభవానికి గురవుతుందని, కేవలం 3 నుంచి 6 సీట్లు మాత్రమే వస్తాయని ప్రకటించడం గమనార్హం. బీఎస్పీ సైతం 11 నుంచి 12 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే వెల్లడించింది.

    ఓట్ల శాతాల వారీగా చూస్తే.. బీజేపీకి 39 శాతం, సమాజ్ వాదీ పార్టీకి 35 శాతం, కాంగ్రెస్ 5 శాతం, బీఎస్పీకి 14 శాతం, ఇతర పార్టీలకు 7 శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనప్పటికీ.. ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని సర్వే తెలిపింది. ఆదిత్యనాథ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని వెల్లడించింది.

    ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకున్న పలు ఘటనలు యూపీ సర్కారుకు ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే. హత్రాస్, ఉన్నావ్, లఖింపూర్ ఖేరీ ఘటనలకు తోడు.. కరోనా సెకండ్ వేవ్ లో వ్యవహరించిన తీరు ఆ పార్టీకి నష్టం కలిగించింది. అయినప్పటికీ.. రాబోయే ఎన్నికల్లో అవి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం.. మహిళా ఓటర్లు అఖిలేష్ యాదవ్ కన్నా.. యోగీ పాలనవైపై మొగ్గు చూపుతున్నారట. ముఖ్యమంత్రిగా.. 43% మంది యోగి ఆదిత్యనాథ్‌ కావాలని కోరుకోగా.. ప్రియాంక గాంధీకి 14% మంది మాత్రమే మద్దతు ఇచ్చారని సర్వే తెలిపింది.

    ఇక, కులాలు, మతాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఉత్తరప్రదేశ్‌లో.. ఈ అంశం ఆధారంగా కూడా సర్వే సంస్థ వివరాలు సేకరించింది. 24 శాతం మంది కులం, మతం ఆధారంగా ఓటు వేయబోతున్నామని చెప్పారట. 23 శాతం మంది అభివృద్ధి ఆధారంగా, 21 శాతం మంది శాంతిభద్రతల ఆధారంగా ఓటు వేస్తామని చెప్పారట. రామమందిరానికి మాత్రం 1 శాతం మందే ఓటు వేస్తామని చెప్పారట. మరి, ఆ సర్వే అంచనాల్లో నిజం ఎంతో చూడాలి.