https://oktelugu.com/

బీజేపీ లైట్.. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ పోటీనా?

తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలున్నాయి. అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ లు బలంగా ఉండగా.. బీజేపీ వేళ్లూనుకుంటోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వేళ ఏకంగా కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లను గెలిచి బీజేపీ సత్తా చాటింది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయం బీజేపీనే అని ఆ నేతలు భావిస్తున్నారు. మరి టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు. ? అసలు బీజేపీని గుర్తిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. Also Read: కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : August 1, 2020 / 06:21 PM IST
    Follow us on


    తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలున్నాయి. అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ లు బలంగా ఉండగా.. బీజేపీ వేళ్లూనుకుంటోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వేళ ఏకంగా కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లను గెలిచి బీజేపీ సత్తా చాటింది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయం బీజేపీనే అని ఆ నేతలు భావిస్తున్నారు. మరి టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు. ? అసలు బీజేపీని గుర్తిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి.

    Also Read: కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న సోనియా?

    కమళనాథులు ఎంత గట్టిగా పోరాడుతున్నా అధికార టీఆర్ఎస్ టార్గెట్ మాత్రం కాంగ్రెస్ పార్టీలాగానే కనిపిస్తోంది. ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని.. బీజేపీని లైట్ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

    టీఆర్ఎస్ అస్సలు బీజేపీని పోటీనే కాదని బీరాలకు పోతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీ పోటీకాదంటోంది. కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ వచ్చాక బీజేపీలో చాలా మార్పులు వస్తున్నాయి. యువరక్తం.. యువ నేతలతో ఆ పార్టీ పోరుబాటలో సై అంటోంది.

    Also Read: అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా?

    అయితే క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు, కార్యవర్గం, నేతలు లేకపోవడమే బీజేపీకి అసలు మైనస్ గా టీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు గ్రామస్థాయి నుంచి క్యాడర్, నేతల బలం ఉంది. అయితే టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ తరుఫున నిలబడుతారు. ఈ రెండింటిలో టికెట్ రాని వారు బీజేపీ లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ బలోపేతం చేస్తున్నారు.

    అయితే కేంద్రం బలంతో బీజేపీ ఎంత చెలరేగిపోతున్నా కానీ.. టీఆర్ఎస్ మాత్రం బీజేపీని అస్సలు లెక్కలోకి తీసుకోవడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. కేటీఆర్ మాటలను బట్టి బీజేపీని లైట్ తీసుకుంటే టీఆర్ఎస్ కు నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.