కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న సోనియా?

దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది. అయితే గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటంతో ఆపార్టీ క్రమంగా బలహీనం అవుతోంది. ప్రస్తుతం ఒకట్రెండూ రాష్ట్రాల్లో మినహా కాంగ్రెస్ అధికారంలో లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కమలమయంగా మారుతోన్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతల సమన్వయ లోపం, బీజేపీ ఆకర్ష్ లో భాగంగా ఆ రాష్ట్రాలు క్రమంగా […]

Written By: Neelambaram, Updated On : August 1, 2020 6:08 pm
Follow us on


దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది. అయితే గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటంతో ఆపార్టీ క్రమంగా బలహీనం అవుతోంది. ప్రస్తుతం ఒకట్రెండూ రాష్ట్రాల్లో మినహా కాంగ్రెస్ అధికారంలో లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కమలమయంగా మారుతోన్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతల సమన్వయ లోపం, బీజేపీ ఆకర్ష్ లో భాగంగా ఆ రాష్ట్రాలు క్రమంగా బీజేపీ వశమవుతున్నాయి.

Also Read: బాబును రాజీ’డ్రామా’లతో కొట్టాలనుకున్న జగన్

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతోన్నారు. ఆమె పదవీకాలం ఆగస్టు 10తో పూర్తి కానుంది. దీంతో కాంగ్రెస్ నేతలు కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంది. గతంలోనే సోనియాగాంధీ వయస్సు భారం, అనారోగ్యం కారణాలతో కాంగ్రెస్ అధ్యక్ష పదవీ నుంచి తప్పుకొని ఆ బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించారు. రాహుల్ కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు భుజాన పెట్టుకొని లోక్ సభ ఎన్నికల వరకు అన్నితానై నడిపించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవీ నుంచి తప్పుకోవడంతో తిరిగి సోనియాగాంధీని పార్టీ తాత్కాలిక అధ్యక్షులిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలరీత్య సోనియా గాంధీ పలుమార్లు రాహుల్ గాంధీని పార్టీ పదవీ చేపట్టాలని కోరినట్లు సమాచారం. అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఆమెను పార్టీ బాధ్యతలను చూస్తూ వస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని అధిష్టానం భావించింది. అయితే సోనియా మాటను రాహులు వినకపోవడం.. కరోనా పరిస్థితుల కారణంగా అధ్యక్ష ఎన్నిక వాయిదా పడుతూ వస్తోందని సమాచారం.

Also Read: ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా జనసేన?

కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కేవలం గాంధీ కుటుంబానికే పరిమితం అవడంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ కేవలం కుటుంబ పార్టీ అంటూ ఎద్దేవా చేస్తుంటాయి. గాంధీయేత కుటుంబంలోని వ్యక్తి ఆ పార్టీలో ఎన్నడూ అధ్యక్షుడు కాలేరంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెసులోని ముఖ్యనేతలు మాత్రం గాంధీ కుటుంబంలోని వ్యక్తే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని సోనియాగాంధీని కోరుతున్నారట. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా రాహుల్ తిరిగి పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టాలని కోరారు.

ఇటీవల ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. యూపీ సీఎం రేసులో ప్రియాంక పేరు విన్పిస్తుంది. కొందరు పార్టీ అధ్యక్ష పదవీకి ప్రియాంకను సూచిస్తుండగా మరికొందరు రాహుల్ ను ప్రతిపాదిస్తున్నారు. దీంతో ఈసారి కూడా గాంధీ కుటుంబంలోని వ్యక్తికే కాంగ్రెస్ అధ్యక్ష పదవీ దక్కనుందనే టాక్ విన్పిస్తుంది. అయితే అది రాహుల్ గాంధీనా? లేక ప్రియాంక గాంధీ వీరిద్దరు కాకుండా సోనియాగాంధీనే తిరిగి పదవీని చేపడుతారనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది..!