తెలంగాణ మినీ మున్సిపోల్స్.. గెలుపెవరిది?

తెలంగాణ రాష్ట్ర మిని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి. తెలంగాణలో మినీ మున్సిపల్ పోరు ఆసక్తి రేపుతోంది. రెండు పెద్ద నగరాలు, ఐదు పట్టణాల్లో ఏ పార్టీ పాగా వేస్తుందని ఆసక్తి రేపుతోంది. గ్రేటర్ వరంగల్ కు సంబంధించి […]

Written By: NARESH, Updated On : May 3, 2021 8:37 am
Follow us on

తెలంగాణ రాష్ట్ర మిని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి.

తెలంగాణలో మినీ మున్సిపల్ పోరు ఆసక్తి రేపుతోంది. రెండు పెద్ద నగరాలు, ఐదు పట్టణాల్లో ఏ పార్టీ పాగా వేస్తుందని ఆసక్తి రేపుతోంది. గ్రేటర్ వరంగల్ కు సంబంధించి 66 డివిజన్లు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఇక ఖమ్మం నగరపాలక సంస్థ కౌంటింగ్ బీజీఎస్ఆర్ కాలేజీలో ప్రారంభమైంది. 60 డివిజన్లకు గాను ఇప్పటికే 10 డివిజన్లు టీఆర్ఎస్ ఏకగ్రీవం అయ్యాయి. లెక్కింపు కోసం ప్రతి డివిజన్ కు ఓ కౌంటింగ్ అధికారిని నియమించారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని లింగోజిగూడ, సహా వివిధ పట్టణాల్లో మిగిలిపోయిన వార్డులకు ఉపఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి.

ఇక ఐదు మున్సిపాలిటీల ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడి కానున్నాయి. ఇక ఓట్ల లెక్కింపులో భాగంగా కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. కరోనా నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై నజర్ పెట్టింది. ఖమ్మంలో బీజేపీ తరుఫున ఆంధ్రానేతలు కూడా వచ్చి ప్రచారం చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ఈ ఎన్నిక సాగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభావం కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది.