దేశంలో వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు మనో ధైర్యం కలిగి ఉండాలి. అలా అని ఒకేసారి డైట్ లో విపరీతమైన మార్పులు చేసుకోకూడదు. అలవాటు ఉన్న ఆహార పదార్థాలనే తీసుకుంటూ ఆ ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అన్ని రకాల పోషకాలు అందే విధంగా తగిన జాగ్రత్తలను తీసుకుంటే మంచిది.
ప్రోటీన్ ఎక్కువగా ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం సాధ్యమవుతుంది. కరోనా సోకకుండా ఉండాలన్నా, సోకిన వాళ్లు త్వరగా కోలుకోవాలన్నా కాఫీ, టీలను అస్సలు తాగకూడదు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా నూనెతో చేసిన ఆహార పదార్థాల కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది. వంటలలో ఎక్కువగా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకులను వినియోగించాలి.
ప్రతిరోజూ ఆహారం తీసుకున్న తరువాత పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాల కొరకు ఫుడ్ సప్లిమెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచిది. శీతల పానీయాలు, చక్కెర, రిఫైన్డ్ ఫుడ్, వేయించిన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ ఆహార పదార్థాలు శరీరానికి హాని చేస్తాయి తప్ప మేలు చేయవు.
కరోనా సోకని వాళ్లు తీసుకున్న ఆహారానికి తగిన విధంగా ప్రతిరోజూ అరగంటైనా వ్యాయామం చేయాలి. పండ్లు, కూరగాయలు తీసుకుంటూ, తగినన్ని నీళ్లు తాగడం ద్వారా మాత్రమే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం, కరోనా సోకకుండా ఉండటంతో పాటు సోకినా త్వరగా కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి.