https://oktelugu.com/

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

తెలంగాణలో కరోనా మహ్మమర్మి పంజా విసురుతోంది. కొద్దిరోజులుగా తెలంగాణ కేసులు భారీగా పెరగడమేగానీ తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలో లాక్డౌన్ కఠినంగా అమలు చేసినప్పుడు కొంతమేరకు కరోనా కేసులు కట్టడిలోనే ఉండేవి. ఎప్పుడైతే లాక్డౌన్ సడలింపులు రాష్ట్రంలో భారీగా అమలయ్యే నాటి నుంచి కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోజుకు పదుల సంఖ్యల్లో ఉండే కేసులు ప్రస్తుతం 500లపైనే నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా? […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 22, 2020 3:18 pm
    Follow us on


    తెలంగాణలో కరోనా మహ్మమర్మి పంజా విసురుతోంది. కొద్దిరోజులుగా తెలంగాణ కేసులు భారీగా పెరగడమేగానీ తగ్గుముఖం పట్టడం లేదు. రాష్ట్రంలో లాక్డౌన్ కఠినంగా అమలు చేసినప్పుడు కొంతమేరకు కరోనా కేసులు కట్టడిలోనే ఉండేవి. ఎప్పుడైతే లాక్డౌన్ సడలింపులు రాష్ట్రంలో భారీగా అమలయ్యే నాటి నుంచి కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోజుకు పదుల సంఖ్యల్లో ఉండే కేసులు ప్రస్తుతం 500లపైనే నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

    జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

    గత మూడురోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం 3297 టెస్టులు చేయగా ఆదివారం 730మందికి పాజిటివ్ వచ్చింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 659మంది కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. గురువారం 3188 టెస్టులు చేయగా 546మందికి, జూన్ 19న 2477మందిని టెస్టు చేయగా 499పాజిటివ్‌గా తేలింది. కరోనా టెస్టుల సంఖ్య పెంచడంతో కొత్తగా భారీగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

    తెలంగాణలో గడిచిన 21 రోజుల్లో 5,104 పాజిటివ్ కేసులు వచ్చాయి. మార్చి 22 నుంచి మే 31వరకు కొనసాగిన లాక్డౌన్లో 2,676మాత్రమే నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో అన్‌లాక్‌ మొదలైన తర్వాత పరిస్థితి‌ కరోనా కేసుల విజృంభణ మొదలైంది. గడిచిన మూడు రోజులుగా సగటున రోజుకు 500లపైబడి కేసులు నమోదవుతోన్నాయి. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ ప్రాంతాల్లోనూ టెస్ట్‌లను పెంచారు.

    జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

    ఇదిలా తమిళనాడులోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండగా ఆ రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. మరోవైపు ఏపీలోనూ కరోనా విజృంభిస్తున్న మూడు జిల్లాలో లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేయాలని నిపుణులు కోరుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.