రాజధాని నిర్మాణాలపై మంత్రి బొత్స సమీక్ష ఎందుకో..!

రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వివిధ గృహ సముదాయాలను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. మంత్రి పర్యటన రాజధానిలో ఉత్కంఠ రేపింది. మంత్రి బొత్స సీఆర్డీఏ అధికారులతో కలిసి నేలపాడు, తుళ్లూరు, రాయపూడి ఏరియాల్లో అసంపూర్ణంగా వున్న గృహ సముదాయాల నిర్మాణాలను పరిశీలించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో రాజధాని మార్పు అంశంపై ఇప్పుడు రాజధాని తరలింపు అంశం పక్కన పెట్టినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు, మంత్రి బొత్స నిర్మాణం నిలిచి పోయిన […]

Written By: Neelambaram, Updated On : June 22, 2020 3:07 pm
Follow us on


రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వివిధ గృహ సముదాయాలను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. మంత్రి పర్యటన రాజధానిలో ఉత్కంఠ రేపింది. మంత్రి బొత్స సీఆర్డీఏ అధికారులతో కలిసి నేలపాడు, తుళ్లూరు, రాయపూడి ఏరియాల్లో అసంపూర్ణంగా వున్న గృహ సముదాయాల నిర్మాణాలను పరిశీలించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో రాజధాని మార్పు అంశంపై ఇప్పుడు రాజధాని తరలింపు అంశం పక్కన పెట్టినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు, మంత్రి బొత్స నిర్మాణం నిలిచి పోయిన గృహ సముదాయాలను పరిశీలించడం రాజధాని వాసుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

గృహ సముదాయాల పరిశీలన పూర్తయినా అనంతరం సీఆర్డీఏ అధికారులు, గృహ సముదాయాల కాంట్రాక్టర్లతో సమావేశం అవుతారని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. రాజధానిని స్మశానం అని కామెంట్ చేసిన మంత్రి బొత్స అమరావతిలో పర్యటిస్తూ ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలపై ఆరా తీస్తున్నారు. ఈ సమీక్షకు ప్రాధాన్యత సంతరించికుంది. రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతిని గుర్తించేందుకే మంత్రి ఈ సమావేశం నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి భాద్యులైన వారిని అరెస్టు చేసే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది.

రాజధాని తరలింపుపై ప్రభుత్వం వెనక్కి?

రాజధాని అమరావతిలో పనులను సీఆర్డీఏ చైర్మన్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షించగా, పురపాలక శాఖ మంత్రిగా నారాయణ అప్పట్లో పని చేశారు. రాజధాని వ్యవహారాలను మొత్తం సీఎం పర్యవేక్షణలో ఆయనే నిర్వహించారు. కేవలం నిర్మాణ పనులే కాకుండా, రాజధానిలో వందల ఎకరాల భూమిని వివిధ సంస్థలకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసిన అప్పటి ప్రభుత్వం, ప్రవేటు సంస్థలకు మాత్రం నామ మాత్రపు ధరకే భూములు కేటాయించింది. ఈ అంశంపైన అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సమీక్షలు టిడిపి వర్గాల్లో ఆందోళన నెలకొంది.