https://oktelugu.com/

Big Boss 5 Telugu: మార్పు తీసుకొద్దాం.. ఎంకరేజ్ చేయండి అంటూ ఆ కంటెంట్ కు మద్దతు తెలిపిన నటి సంజన..!

Big Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమం రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి 18 మంది కంటెస్టెంట్ లు కొన్ని సార్లు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ ల విషయానికి వస్తే ఒకరికొకరు బద్ద శత్రువులుగా మారుతూ గొడవ పడుతూ, అరుచుకుంటూ, చివరకు కొట్టుకునే వరకు వెళ్తున్నారు. అదేవిధంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల మధ్య […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 18, 2021 / 10:48 AM IST
    Follow us on

    Big Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమం రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి 18 మంది కంటెస్టెంట్ లు కొన్ని సార్లు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ ల విషయానికి వస్తే ఒకరికొకరు బద్ద శత్రువులుగా మారుతూ గొడవ పడుతూ, అరుచుకుంటూ, చివరకు కొట్టుకునే వరకు వెళ్తున్నారు. అదేవిధంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల మధ్య స్నేహ బంధాలు శత్రుత్వాలు ప్రేమలు కూడా మొదలవుతూ ప్రేక్షకులకు ఈ కార్యక్రమం పై ఆసక్తిని కలిగేలా చేస్తున్నారు.

    ఇదిలా ఉండగా తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమానికి కన్నడ నటి సంజనా స్పందిస్తూ… బిగ్ బాస్ విజేతగా ఎప్పుడు అమ్మాయిలు లేదా అబ్బాయిలు గెలుస్తూ ఉన్నారు.. అయితే ఈసారి భిన్నంగా ఆలోచించండి. ఈసారి మార్పు తీసుకువద్దాం… తనని ఎంకరేజ్ చేయండి అంటూ ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కి తన మద్దతు తెలిపారు. ట్రాన్స్ జెండర్స్ నిత్యం వారి జీవితం కోసం పోరాడుతూనే ఉంటారు. వాళ్లపై నాకెప్పుడు సాఫ్ట్ కార్న్ ఉంటుంది. అందుకే తనన సపోర్ట్ ప్రియాంక కేననే, తన కోసమే ఈ వీడియో చేస్తున్నానని, తనకు ఎక్కువ ఓట్లు వేసి తనని గెలిపించండి అంటూ నటి సంజన తెలిపారు.

    అదేవిధంగా జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకకి ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించినటువంటి నాగబాబు కూడా తన పూర్తి మద్దతు తనకేనని తెలియజేశారు. తన అభిమానులు కూడా ప్రియాంకకు మద్దతు తెలపాలని నాగబాబు కోరారు ఇకపోతే బిగ్ బాస్ మొదటి వారంలో భాగంగా హౌస్ నుంచి కంటెస్టెంట్ సరియు ఎలిమినేట్ కాగా ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.