డేంజరస్ డెల్టా వేరియంట్.. 80 దేశాల ఆందోళన

భారతదేశంలో కరోనా మహమ్మారి ఉపద్రవమే సృష్టించింది. దేశంలో మొదటగా బయటపడిన కొవిడ్ డెల్టా వేరియంట్ ఘోర ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 80 దేశాల్లో ఈ వేరియంట్ గణనీయంగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. దేశంలో మొదటిసారిగా గుర్తించబడిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్య వైవిధ్యంగా మారుతోందని చెప్పారు. ఇది గణనీయంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ […]

Written By: Srinivas, Updated On : June 19, 2021 5:31 pm
Follow us on

భారతదేశంలో కరోనా మహమ్మారి ఉపద్రవమే సృష్టించింది. దేశంలో మొదటగా బయటపడిన కొవిడ్ డెల్టా వేరియంట్ ఘోర ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 80 దేశాల్లో ఈ వేరియంట్ గణనీయంగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు.

దేశంలో మొదటిసారిగా గుర్తించబడిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్య వైవిధ్యంగా మారుతోందని చెప్పారు. ఇది గణనీయంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి వారం విడుదల చేసే కొవిడ్-19 నివేదికల్లో భాగంగా తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 80 దేశాలలో డెల్టా వేరియంట్ తన ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

మరో పన్నెండు దేశాలు, మరికొన్ని ప్రాంతాల్లో బి-1.617 వేరియంట్ బయటపడింది. అయితే డెల్టా వేరియంట్ బి.1.617.2 మొదట దేశంలోనే గత అక్టోబర్ లో బయటపడింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విఫల యత్నాలు చేస్తున్న క్రమంలో ఒక చోట నుంచి మరొక చోటికి ప్రబలుతున్న వేరియంట్ లతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. కరోనా మహమ్మారి రోజుకో రూపం తీసుకుంటుంది.

యూకేలో 99 శాతం డెల్టా వేరియంట్ ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. సౌమ్య స్వామినాథన్ ప్రస్తుతం వినియోగిస్తున్న వ్యాక్సిన్లు సామర్థ్యంపై మరింత పరిశోధనలు జరగాలని అభిప్రాయపడ్డారు. మరోపక్క అమెరికాకు సైతం డెల్టా వేరియంట్ తో ముప్పు పొంచి ఉందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.