Homeజాతీయ వార్తలుTelangana Liberation Day: అమిత్ షా రాక.. తెలంగాణలో ‘విమోచన’ వేడి

Telangana Liberation Day: అమిత్ షా రాక.. తెలంగాణలో ‘విమోచన’ వేడి

Telangana Liberation Day: Arrival of Amit Shah .. ‘Liberation’ heat in Telangana:  తెలంగాణ విమోచనం దినం సందర్భంగా నిర్మల్ లో భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తుండడంతో వేడి రాజుకుంది. ప్రధానంగా తెలంగాణలో అధికారికంగా విమోచన దినం జరపని తెలంగాణ సర్కార్ ను బీజేపీ టార్గెట్ చేయబోతోంది. అమిత్ షా ఖచ్చితంగా దీనిపై కేసీఆర్ సర్కార్ ను కార్నర్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నిర్మల్ లో బీజేపీ తలపెట్టిన ‘విమోచన సభ’ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. దీన్ని మరింత పెంచుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు.

రేపు సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ మొదటి నుంచి అదే డిమాండ్ చేస్తోందని వివరించారు. అధికారంలోకి రాకముందు ఒక వాదన, వచ్చాక మరో వాదన టీఆర్ఎస్ నైజమని విమర్శించారు. ‘‘బీజేపీ ఇందుకోసం పోరాటాలు చేసింది. లాఠీదెబ్బలు తిన్నం. జైళ్లకు పోయినం. ఏటా సభలు నిర్వహిస్తున్నాం. ఈసారి నిర్మల్ లో సభకు కేంద్ర హోంమంత్రి, స్పూర్తి ప్రదాత అమిత్ షా నాందేడ్ నుంచి నిర్మల్ వస్తున్నారు. ఒకేసారి వెయ్యి మందిని నిర్మల్ లో ఉరితీశారు. రేపు 12 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున జనం, కార్యకర్తలు తరలివస్తారు’’ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు..

•గత నెల 28న మొదలైన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు కష్టాలు చెప్పుకుంటున్నరు. వారిలో భరోసా నింపే యత్నం చేస్తున్నా. ప్రజల బాధలు, కష్టాలు చూస్తుంటే టీఆర్ఎస్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది.
•రేపు ఉదయం 7 గంటలకు జాతీయ జెండాలు ఎగరేసి వెంటనే నిర్మల్ రావాలని కార్యకర్తలను కోరుతున్నా.
•రేపు నరేంద్ర మోదీ దినోత్సవం, విశ్వకర్మ దినోత్సవం కూడా ఉంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తం.
•తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు నిన్న సవాల్ విసిరారు. 2.72 లక్షల కోట్లు పన్నుల రూపాయలు తీసుకుని తెలంగాణ కు కేంద్రం ఇస్తున్నది రూ.1.46 లక్షల కోట్లు మాత్రమేనని సవాల్ విసిరిండు. తెలంగాణపై వివక్ష రగిలించే అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు.
•రాష్ట్రాన్ని దివాళా తీయించి జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టారు. కుటుంబ ఆదాయాన్ని మాత్రం కేసీఆర్ పెంచుకుంటున్నారు. తెలంగాణకు జరిగే అన్యాయం గురించి ఆలోచించని వ్యక్తి. నీళ్లు-నియామకాల విషయంలో అన్యాయం చేస్తున్న వ్యక్తి కేసీఆర్. మొట్టమొదటి ద్రోహి కేసీఆర్.
•మోదీని చూస్తే సర్దార్ పటేల్…..కేసీఆర్ ను చూస్తే…నిజాం గుర్తుకు వస్తున్నడు.
•కేంద్రం రాష్ట్రానికి రూ.1.04, 717 లక్షల కోట్లు పన్నుల వాటా ఇస్తోంది. వివిధ సంక్షేమ పథకాల కోసం రూ.1 లక్ష 22 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చింది.
•ఇవిగాక జాతీయ రహదారుల నిర్మాణానికి తెలంగాణకు రూ.40 వేల కోట్లు మంజూరు చేసింది. రూ.21 వేల కోట్లు విడుదల చేసింది.
•రైల్వే బడ్జెట్, కొత్త ప్రాజెక్టుల కోసం రూ.23, 491 కోట్లు ప్రత్యేకంగా తెలంగాణకు కేటాయించినం.
•ఏ జాతీయ విపత్తు వచ్చినా కేంద్రమే ఆదుకుంటుంది. తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విపత్తు నుండి ప్రజలను ఆదుకునేది కేంద్రమే. అందులో భాగంగా ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు.
•తెలంగాణలో 18 ఏళ్ల పైబడి ఉన్నవారు 2.70 కోట్లు. వాళ్లకు వ్యాక్సిన్ నిధులు రూ.2,700 కోట్లు మంజూరు చేసినం.
•ఇవన్నీ కలిపితే రూ.2.52, 908 కోట్లు ఇచ్చినం. ఇవి నామమాత్రమే. దీనికి సీఎం సమాధానం చెప్పాలి.
•కేంద్రం ఇవ్వకపోతే….మీ ఎంపీలు పార్లమెంట్ లో ఈ ప్రశ్నకు ఎందుకు అడగలేదు? మోదీ వద్దకు పోయి వంగి వంగి దండాలెందుకు పెడుతున్నరు? మా పన్నులకు తగ్గ వాటా ఎందుకు ఇస్తలేరని ఎందుకు అడగలేదు? అడిగితే అక్కడే సమాధానం చెప్పేవాళ్లు
•రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్టాల బాధ్యతలు స్పష్టంగా ఉన్నాయి. పన్నుల వసూళ్లు, కేటాయింపులు, ఖర్చులకు స్పష్టమైన చట్టాలున్నాయ్.
•దేశ రక్షణ, విమానయానం, టెక్నాలజీ, విపత్తుల, శాటిలైట్ల నిర్వహణను కేంద్రమే నిర్వహిస్తోంది. దేశ రక్షణ ముఖ్యం కాదా?
•కోవిడ్ వస్తే మోదీ ఆదుకున్నారు. ఇలాంటి విపత్తు వస్తే మీరు ఏనాడైనా ఆదుకున్నారా?
•యూపీఏ హయాంలో రాష్ట్రాలకు పన్నుల వాటా చెల్లింపు 32 శాతం ఉండగా….మోదీ ప్రభుత్వం 41 శాతానికి పెంచినం. అంటే 9 శాతం నిధులు రాష్ట్రాలకు అదనంగా పెంచాం. నిధులు కేటాయింపుకు సంబంధించి పూర్తి డేటా నా వద్ద ఉంది.
•ఇంత పెద్ద ఎత్తున తెలంగాణకు నిధులు కేటాయిస్తున్నా….కనీసం క్రుతజ్ఝత కూడా చెప్పని నీచుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తే కనీసం క్రుతజ్ఝత చెప్పలేదు. ఫొటోలు మాత్రం కేసీఆర్ తగిలించుకుంటు. సిగ్గుండాలి.
•తెలంగాణలో 90 శాతం రైతులు అప్పులపాలైండ్రు. ఇందులో 40 శాతం మంది ప్రైవేటు వాళ్ల అప్పులు తీసుకుని వడ్డీలు చెల్లించలేక అల్లాడుతున్నరు. ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి.
•పాలన చేతగాని సీఎం ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఉప ఎన్నికలపై మళ్లిస్తడు.
•హైదరాబాద్ లో పాతబస్తీ మినహా అంతా పన్నులు చెల్లిస్తరు. పాతబస్తీలో మాత్రం బిల్లులు కట్టరు. పన్నులు కట్టరు. ఎందుకు కట్టించరు?
•అట్లాగే హైదరాబాద్ లో కట్టే పన్నుల ఆదాయాన్ని వెనుకబడ్డ ఇతర జిల్లాల్లో ఖర్చు చేస్తరు కదా…దీని గురించి ఏం చెబుతరు?
•మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాపాడుకోలేని నువ్వు(కేసీఆర్) దిగజారిన రాజకీయాలు చేస్తున్నవ్. అంత దిగజారుడు రాజకీయాలు ఎందుకు?
•ముఖ్యమంత్రి కేసీఆర్…..ప్రధానమంత్రి వద్ద అపాయిట్ మెంట్ తీసుకుంటే కలిసి వెళదాం. అక్కడ మాట్లాడదాం. ఎవరు ఎవరికి అన్యాయం చేస్తున్నరో తెలుస్తది.
•మహబూబ్ నగర్ భూత్పూర్ మండలంలోని మహేశ్ అనే బీజేపీ కార్యకర్తను నిమజ్జనం సందర్భంగా టీఆర్ఎస్ కు చెందిన గ్రామ సర్పంచ్ భర్తసహా 15 మంది కంకర రాళ్లతో, గాలిలో ఎగరేసి కొడితే ప్రాణాలు కోల్పోయిండ్రు.
•మీడియాకు విజ్ఝప్తి చేస్తున్నా….ఇంత దారుణం జరిగితే బయట ప్రపంచానికి చూపరా? ఇది చాలా బాధన్పించింది. ఎందుకు అలా చేయలేదు? లోకల్ రిపోర్టర్లు రాయలేదా? మేనేజ్ మెంటే వద్దనుకుందా? ఆలోంచించండి. సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
•అదే బీజేపీ కార్యకర్తలు ప్రతి చర్యలకు పాల్పడితే తప్పుదోవ పట్టిస్తున్నరు. మావి ప్రాణాలు కాదా?
•ఉన్నతాధికారులు ఎవరికి గులాంగిరి చేస్తున్నరో అర్ధం కావడం లేదు.
•రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం రాబోతుందో ఇంటెలిజెన్స్ అధికారులను అడగండి. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. లేకుంటే ఇబ్బంది పడతారు. చట్టపరంగా, న్యాయం పని చేయండి. శాంతి భద్రతలు కాపాడే అధికారులే శాంతి భద్రతలకు విఘాతం స్రుష్టిస్తే వాళ్లే బాధ్యత వహించక తప్పదు.
•టీఆర్ఎస్ నాయకులకు ఇతర పార్టీల వాళ్లను చంపమని లైసెన్సులు ఇచ్చారా? తక్షణమే ఎరుకల మహేశ్ ను హత్య చేసిన వారిని అరెస్టు చేయాలి. కఠినంగా శిక్షించాలి. లేకుంటే ఊరుకునేది లేదు.
•రేషన్ బియ్యం, కంపా నిధులు, అమ్రుత్ నిధులు, రైతు వేదికలకు, నర్సరీలకు, ప్రక్రుతి వనాలకు, వైకుంఠధామాలకు, రోడ్లు, టాయిలెట్లు, ఫసల్ భీమా, ఆయుష్మాన్ భారత్ వంటి వాటికి నిధులన్నీ కేంద్రమే ఇస్తోంది. మరి సీఎం సహా మంత్రులంతా రాజీనామా చేస్తారా? (విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ…)
•అసెంబ్లీ స్పీకర్ విసిరిన సవాల్ పై స్పందిస్తూ…..దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ను సవాల్ విసరమనండి సమాధానం చెబుతా. ప్రధానివద్దకు పోయిన కేసీఆర్ ఎందుకు సవాల్ విసరలేదు? పైగా సబ్సిడీలన్నీ బంద్ చేసిండు. రైతుబంధు ఒక్కటి అమలు చేస్తుండు. అందులో కష్టాల్లో ఉన్న కౌలు రైతులకు మాత్రం రైతు బంధు ఇవ్వడం లేదు.
• బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కేటేనంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్న కొట్టిపారేశారు. గతంలో టీఆర్ఎస్-కాంగ్రెస్-టీడీపీ-ఎంఐఎం పార్టీలు పోటీ చేసినయ్. ఏనాడైనా బీజేపీతో టీఆర్ఎస్ కలిసి పోటీ చేసిందా? మీరే ఆలోచించండి.
•ఉప ఎన్నికలకు ముందు పోడు భూముల విషయంలో రేపే వచ్చి కుర్చీ వేసుకుని కూర్చుంటానన్న సీఎం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. అన్నీ అబద్దాలే చెబుతుండు. అది నోరా తాటిమట్టా? పోడు భూములపై పోరాటం చేస్తున్నది, లాఠీ దెబ్బలు తింటున్నది, జైళ్లకు పోతున్నది బీజేపీ కార్యకర్తలు మాత్రమే.
•సీఎం మాటలు విని పోడు రైతులు అల్లాడుతున్నరు. పంట వేయమని చెప్పేది కేసీఆరే. ఆ పంటను నాశనం చేయించేది ఈయనే. ఇకనైనా అలాంటివి మానుకుని పోడు భూముల సమస్యను పరిష్కరించాలి.

ప్రెస్ మీట్ లో పాల్గొన్న నేతలు : పార్టీ జిల్లా అధ్యక్షులు అరుణ తార, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, హన్మకొండ అర్బన్ ఇంచార్జీ, కాటేపల్లి మాజీ జ్పీ ఛైర్మన్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, జిల్లా ఇంచార్జీ మహిపాల్ రెడ్డి బద్దం, జిల్లా నాయకులు నీలం చిన్నరాజులు, బాపు రెడ్డి వేణుగోపాల్ గౌడ్, హనుమాండ్లు తదితరులు….

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular