పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్ కో మరింత పెంచింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అంతకు ముందు 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఏపీ అధికారులు తెలిపారు. పులిచింతలలోని మూడు యూనిట్లలో తెలంగాణ జెన్ కో కరెంట్ ఉత్పత్తి చేస్తూ 9,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఉత్పత్తిని పెంచడం చర్చనీయాంశమవుతోంది.