Homeజాతీయ వార్తలుKCR VS Opposition Party’s: ఉద్యోగాల ప్రకటనపై ప్రతిపక్షాల గోల

KCR VS Opposition Party’s: ఉద్యోగాల ప్రకటనపై ప్రతిపక్షాల గోల

KCR VS Opposition Party’s: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శాసనసభ వేదికగా ఉద్యోగాల ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో దాని ప్రక్రియ వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం మంచి పరిణామమే అని చెబుతున్నాయి. కానీ ఉద్యోగాలు అంత తక్కువగా భర్తీ చేయడమేమిటని ప్రశ్నిస్తున్నాయి.

Telangana Elections
Telangana CM KCR

రాష్ట్రంలో తెలంగాణ రావడానికి ముందే దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా ఇప్పుడు ప్రభుత్వం 90 వేలు అని చెబుతూ నిరుద్యోగులను తప్పు దారి పట్టిస్తోందని చెబుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని విమర్శిస్తున్నాయి. నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతున్నా ప్రతిపక్షాలు మాత్రం ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ నిర్వాకంతో నిరుద్యోగులకు మేలు చేకూరడం లేదని విమర్శిస్తున్నాయి.

Also Read: ముందస్తు కోసమే కేసీఆర్ నిరుద్యోగులకు వరాలు ప్రకటించారా?

మరోవైపు స్థానికతకు పెద్దపీట వేయాలని చెబుతున్నదానిపై మాత్రం స్వాగతిస్తున్నాయి. దీంతో ఎక్కడి వారికి అక్కడే ఉద్యోగావకాశాలు రావడం మంచిదే అని సూచిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాల్లో సైతం 95 శాతం స్థానికతకు రిజర్వేషన్ కల్పించే దానిపై స్సష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేసీఆర్ నిరుద్యోగుల సమస్య తీర్చి నిరుద్యోగాన్ని పారదోలాలని చూడటం సమంజసమే అని సూచిస్తున్నారు.

Telangana Politics
CM KCR

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిపై కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. గతంలోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఈ బడ్జెట్ లో మాత్రం దాని ఊసే ఎత్తకపోవడంపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన తేవడం లేదని అడుగుతున్నాయి. దీనిపై కూడా ప్రకటన చేయాలని ఆశిస్తున్నాయి. ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మరిన్ని ఉద్యోగాల కల్పనకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాయి.

Also Read: టాలీవుడ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా మోడీ – కేసీఆర్ !

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

3 COMMENTS

  1. […] KCR- Jagan Mohan Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ లో కూడా అసంతృప్తి పెరగనుంది. సాధారణంగా రెండు రాష్ట్రాల్లో ఒకరు చేసింది మరొకరు చేసే దాకా ఊరుకోరు. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల జాతరతో ఏపీలో కూడా నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరుగుతోంది. పక్క రాష్ట్రం చూడు అలా చేస్తుంటే నువ్వెందుకు చేయవు అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో జగన్ మెడకు ఉద్యోగాల బరువు పడనుంది. అసలే అప్పుల్లో రాష్ర్టం కుదేలవుతుంటే కొత్తగా ఉద్యోగాలు ఎక్కడ నుంచి ఇచ్చేదని జగన్ తల పట్టుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ గాడితప్పడంతోనే పాలన కొడిగడుతోంది. […]

  2. […] Congress 5 State Elections 2022: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరిలో ఆసక్తి ఏర్పడింది. అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో పార్టీలు అందుకనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. తాము విజయం సాధించే చోట్ల ఎలాగైనా ప్రతిపక్షాల గాడిలో పడకుండా ఉండేందుకు ప్రణాళికలు ఖరారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవాలో కూడా హంగ్ ఏర్పడుతుందని చెప్పినందున కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. పనాజీకి ముఖ్య నేతల్ని పంపించింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అక్కడ ఉండి పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. […]

Comments are closed.

Exit mobile version