https://oktelugu.com/

Mucherla Aruna in Chiranjeevi movie: మెగాస్టార్ సినిమాలో అలనాటి కలువ కళ్ల నటి

Mucherla Aruna in Chiranjeevi movie: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించబోతుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరు ?, కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి ఆమె, అందం, అభినయం కలబోసిన ఆ నటినే ‘ముచ్చెర్ల అరుణ’. ఆమె కన్నులు కలువ పూలులా ఉంటాయి. ఆ కలువ కళ్లతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆమె మన తెలుగమ్మాయే. ఒకప్పుడు క్యారెక్టర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 9, 2022 / 05:40 PM IST
    Follow us on

    Mucherla Aruna in Chiranjeevi movie: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించబోతుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరు ?, కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి ఆమె, అందం, అభినయం కలబోసిన ఆ నటినే ‘ముచ్చెర్ల అరుణ’. ఆమె కన్నులు కలువ పూలులా ఉంటాయి. ఆ కలువ కళ్లతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆమె మన తెలుగమ్మాయే.

    megastar chiranjeevi

    ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ క్రేజ్ ఉన్న ‘ముచ్చెర్ల అరుణ’.. సినిమాలకు దూరంగా తన జీవితాన్ని పూర్తిగా ఇంటికే పరిమితం చేసుకుంది. అయితే గత ఏడాది నుంచి ‘ముచ్చెర్ల అరుణ’ నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. మలయాళంలో ‘ముచ్చెర్ల అరుణ’ ప్రస్తుతం ఒక సినిమాలో కూడా నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు మెగా పిలుపు అందింది అని, కాబట్టి గాడ్ ఫాదర్ లో ఒక ప్రత్యేక పాత్రలో ఆమె కనిపించబోతుందని టాక్ నడుస్తోంది.

    Also Read: మెగాస్టార్ పై ‘పవర్ స్టార్ ఫ్యాన్స్’ సీరియస్ !

    అయితే ఆమె ఏ పాత్ర చేయబోతుంది ? ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయా ? లేక పక్కా ఎమోషనల్ పాత్రలో ‘ముచ్చెర్ల అరుణ’ కనిపించబోతుందా ? అనేది చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే.. మలయాళ వెర్షన్ లో ‘మంజు వార్యర్’ పాత్రనే తెలుగులో ‘ముచ్చెర్ల అరుణ’ చేయబోతోందట. ఈ పాత్ర హీరోకి చెల్లి పాత్ర. చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

    Mucherla

    నిజానికి తెలుగు వర్షన్ లో ఈ పాత్రలో సీనియర నటి శోభన నటించబోతున్నట్లు ఆ మధ్య బాగా వినిపించింది. ఆ తర్వాత కుష్బూ పేరు వినిపించింది. ఇప్పుడు ‘ముచ్చెర్ల అరుణ’ పేరు వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఒక్క పాత్ర పైనే ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. మొదట్లో సుహాసిని కూడా నటిస్తోంది అన్నారు,

    అన్నట్టు మధ్యలో అనసూయ కూడా నటిస్తోంది అన్నారు. చివరకు ‘ముచ్చెర్ల అరుణ’ పేరును ఫైనల్ చేశారు మేకర్స్. కాగా కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ ఈ సినిమాలో వెరీ స్టైలిష్‌ గా కనిపించనున్నారు.

    Also Read:  భీమ్లానాయక్ టు ఆర్ఆర్ఆర్: సినిమాల్లో హీరోలు తెలంగాణ యాస మాట్లాడితేనే హిట్టా?

    Tags