
మే 23.. ఈ చారిత్రక రోజు ఏపీ చరిత్రలో అధికార మార్పిడికి కారణమైంది. నిజానికి ఏపీ చరిత్ర చూస్తే బలమైన మీడియా ఉన్న పార్టీనే గెలిచింది. శాసించింది. 2014 ఎన్నికల్లో గెలుస్తాడనుకున్న వైఎస్ జగన్ ను ఓడించింది బలమైన ఎల్లో మీడియానే. ప్రధానిగా మోడీ అవుతారని.. బీజేపీతో పొత్తు కట్టిన టీడీపీ గెలిస్తేనే విడిపోయిన ఏపీకి లాభం అని నాడు ఎల్లోమీడియా చేసిన ప్రచారాన్ని జనం నమ్మారు.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిని గెలిపించారు.కానీ 2019 వచ్చేసరికి చంద్రబాబు బలమే బలహీనతైంది. జగన్ కు డిజిటల్ ప్రచారం.. సోషల్ మీడియా బలమైంది. బలమైన మీడియా సపోర్టు లేని జగన్ కు సోషల్ మీడియానే ఆయుధమైంది. అదే గెలుపునకు కారణమైందనడంలో ఎలాంటి సందేహం లేదు.
*సోషల్ మీడియా, డిజిటల్ మీడియానే జగన్ కు బలం
ఏపీలో వైసీపీ ఘనవిజయం వెనుక అనేక అంశాలు పనిచేశాయి. విజయానికి దోహదపడ్డ ప్రధాన కారణాల్లో ఒకటి వైసీపీ డిజిటల్ మీడియా ప్రచారం. వైసీపీ ఇందుకోసం ఒక మెరికలాంటి లేడిని సోషల్ మీడియా ఇన్ చార్జిగా పెట్టుకుంది. ‘దివ్యారెడ్డి’ని ఈ వింగ్ కు నియమించుకొని ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో ఏపీలోని అందరికీ చేరువ చేసేలా పకడ్బందీగా ముందుకెళ్లింది.. అదే వైసీపీ విజయంలో కీలకమైంది.
*వైసీపీ డిజిటల్ మీడియా దన్ను
వైసీపీ డిజిటల్ మీడియా బృందం దివ్యారెడ్డి ఆధ్వర్యంలో జనాలకు కనెక్ట్ అయ్యేలా వ్యూహాలు రూపొందించింది. బలమైన ఎల్లో మీడియా చానెల్స్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాయి. ముఖ్యంగా వీరు రూపొందించిన ‘బైబై బాబు, నిన్ను నమ్మం బాబు’ హ్యాష్ ట్యాగ్ లతో విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని ప్రజలకు తెలిసేలా టీడీపీ వ్యతిరేక ప్రచారం సక్సెస్ అయ్యింది.
*జగన్ కు కలిసొచ్చినవి ఇవే
ఇక జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలన్న కారణాలను కూడా ఇదే సోషల్ మీడియా విభాగాలు రూపొందించాయి. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటూ వైసీపీ అనుకూల ప్రచారం నిర్వహించింది. ఈ నినాదం ప్రజల్లోకి దావానంలా వ్యాపించింది. చాలా మందిని కదిలించింది.. ప్రేరేపించింది. మంచి భవిష్యత్తు కోసం ఏపీలో మార్పు రావాలని నినదానికి ప్రజలు స్పందించి జగన్ ను గెలిపించారు.
*అధికారం కట్టబెట్టిన పాదయాత్ర
ఇక జగన్ నిర్వహించిన పాదయాత్ర ప్రజలకు చేరువ చేసింది. ఆయనను ప్రజానాయకుడిగా చేసింది. జగన్ పాదయాత్రతో ప్రతీ మూలకు వెళ్లడం ప్లస్ అయ్యింది. ఎల్లో మీడియాను ఎదుర్కోవడంలో జగన్ నియమించిన డిజిటల్ ప్రచారం బాగా సక్సెస్ అయ్యింది. శక్తివంతమైన ఎల్లో మీడియా ఎంత ప్రచారం చేసినప్పటికీ వైసీపీ డిజిటల్ ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది. బాబు పాలనపై ఎల్లో మీడియా గోబెల్ ప్రచారాన్ని.. అర్థ అసత్యాలకు విసిగిపోయిన జనాలు మార్పు అవసరమని జగన్ ను గెలిపించారు.
*ప్రజలు తెలివైన వారు..
ఎల్లో మీడియా ఎంత బలంగా ప్రచారం చేసినా.. జగన్ కు మీడియా సపోర్టు తక్కువగా ఉన్న ప్రజలు వాస్తవాలను గుర్తించడంలో తెలివైన వారని నిరూపించారు. సరైన నాయకత్వాన్ని వారు ఎన్నుకున్నారు. టీడీపీని తిరస్కరించారు. వైసీపీ చారిత్రిక విజయంలో డిజిటల్ మీడియా పాత్ర ఎనలేనిదని వైసీపీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి.
-నరేశ్ ఎన్నం