https://oktelugu.com/

IPS Sajjanar : ఏపీ యూట్యూబర్ ఆగడాలు.. తెలంగాణ ఐపీఎస్ సజ్జనార్ సీరియస్.. డిజిపికి రిక్వెస్ట్!*

IPS Sajjanar : ఇటీవల ఆన్ లైన్ మోసాలతో పాటు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో యూట్యూబర్ ప్రమోషన్స్ సంచలనంగా మారాయి.

Written By: , Updated On : February 22, 2025 / 11:30 AM IST
IPS Sajjanar

IPS Sajjanar

Follow us on

IPS Sajjanar : సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్( senior IPS officer Sajjnar) . ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది. సమర్థ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటారు. అటువంటి ఆయన ఏపీ డీజీపీకి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఏపీకి చెందిన ఓ యు ట్యూబర్ పై ఫిర్యాదు చేశారు. సదరు యూట్యూబర్ చేస్తున్న మోసంపై ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ బాయ్ నాని పై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కోరారు.

* ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండిగా..
ప్రస్తుతం సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండిగా( Telangana RTC MD ) వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలతో పాటు ఆన్లైన్ మోసాలపై ఎక్కువగా స్పందిస్తుంటారు సజ్జనార్. ఈ క్రమంలో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని( local boy Nani) వీడియోలను చూశారు. దీంతో అప్రమత్తం అయ్యారు. డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయని.. బెట్టింగ్ భూతాలను ప్రమోట్ చేసి ప్రజలను చెడగొట్టవద్దని హితవు పలికారు. యువతను బెట్టింగ్ యాప్ లకు బానిసలను చేయడం సరికాదన్నారు. చట్ట ప్రకారం సిక్సలు తప్పవని హెచ్చరించారు.

* తీవ్ర స్థాయిలో ఆగ్రహం
ఇటీవల లోకల్ బాయ్ నాని ( local boy Nani )వీడియో ఒకటి వైరల్ అవుతోంది.’ చూశారా వస్తువులను కొనడం ఎంత సులువో.. అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట’ అంటూ చేసిన వీడియోను ప్రదర్శించారు సజ్జనార్. ఇంతకంటే దిక్కుమాలిన తనం ఏమైనా ఉంటుందా? చెప్పండి.. ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేకమంది ప్రాణాలు తీస్తుంటే.. తమకేం పట్టనట్టు స్వలాభం కోసం సోషల్ మీడియా లో యూట్యూబర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వ్యాసాలు వేస్తున్నారు అంటూ మంది పడ్డారు సజ్జనార్. మాకు ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామని పెడ ధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సజ్జనార్.