Megastar Chiranjeevi
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు మీడియా కి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ వచ్చిన మెగాస్టార్, ఆరేళ్ళ క్రితం ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి వాటిని వాడుతున్న తీరుని చూసి యువతరం కూడా ఆశ్చర్యపోవాల్సిందే. యంగ్ హీరోలెవ్వరూ కూడా ఇంత కొత్త ఆలోచనలతో ట్విట్టర్ అకౌంట్ ని నడపలేరేమో అనిపించక తప్పదు. రీసెంట్ గా ఆయన చేసిన ఒక వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. వీడియో ప్రారంభంలో చిరంజీవి ‘బో..బోబో’ అంటూ కోడి కోసం వెతుకుతూ ఉంటాడు. ఏమైంది ఈయనకి ఇలా అయిపోయాడని అభిమానులు ఆలోచిస్తున్న సమయంలో ‘నేనేంటి కోడి కోసం వెతుకుతున్నాను అనుకుంటున్నారా?, ఏంలేదండి నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న బంగారు కోడి పెట్ట మిస్ అయ్యింది. ఎంత వెతికినా దొరకలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశాను’ అని చెప్పుకొచ్చాడు.
అప్పుడు పోలీసులు నావైపు చూస్తూ ‘ఏమయ్యా ఎక్కడైనా బంగారు కోడి పెట్ట ఉంటుందా, ఎవరికీ కహానీలు చెప్తున్నావ్ అని నావైపు చూసి ఎగతాళిగా నవ్వారు. ఇదేంటి ఎవరికి చెప్పినా నమ్మడం లేదని నేను బాధపడుతుంటే ఒక అతను చెప్పాడు మార్చి 22న సాయంత్రం పూట హైదరాబాద్ టాకీస్(Hyderabad Talkies) వారు మన కీరవాణి(MM Keeravani) గారి ఆద్వర్యంలో ఒక మ్యూజిక్ కన్సర్ట్ జరగబోతుంది. అక్కడ కచ్చితంగా మీ బంగారు కోడిపెట్ట దొరుకుతుంది అన్నారు. నాకు కూడా నమ్మకం మొదలైంది. నేను ఆ బంగారు కోడిపెట్ట ని పట్టుకోవడం కోసంగా అక్కడికి వస్తున్నాను. అలాగే మీరు కూడా అక్కడికి వెళ్ళండి. నా బంగారు కోడిపెట్టని పట్టుకోండి, వాటేసుకోండి, తీసుకొచ్చేసేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ రకంగా కూడా ప్రొమోషన్స్ చేయొచ్చా అని ఈ వీడియో ని చూసినప్పుడే అర్థమైంది అంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కామెంట్స్ నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నారు.
మార్చి 22న జరగబోయే ఈ మ్యూజికల్ కన్సర్ట్ లో అత్యధిక శాతం మెగాస్టార్ చిరంజీవి పాటలు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన గెస్ట్ గా వెళ్తున్నారు కాబట్టి. ఇకపోతే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘విశ్వంభర’ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ కంపొజిషన్ దాదాపుగా పూర్తి అయిపోయింది. టీజర్ కి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గత ఏడాది విడుదలైన ఈ టీజర్ కి గ్రాఫిక్స్ కారణంగా బీభత్సమైన ట్రోల్స్ వచ్చాయి కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి కూడా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరిందట. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కీరవాణి తో కలిసి చేస్తున్న మొదటి చిత్రమిది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి.
Bangaru Kodi Petta holds a special place in my heart, & your words bring back cherished memories @KChiruTweets garu
Stay tuned as I bring Bangaru Kodi Petta ur way On March 22nd Hitex!
Presented by @Hyderabadtalkies @MyMusicMyCount2 #NaTourMMK #Chiranjeevi #Hyderabadtalkies pic.twitter.com/1wL7bXfnLA
— mmkeeravaani (@mmkeeravaani) February 21, 2025