CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కేసుల్లో వేగం పెరుగుతోంది. ఇప్పటికే కోర్టుల్లో పలు కేసులు పెండింగులో ఉండగా విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా కొందరు ముఖ్యమంత్రి పదవులు పొంది మరీ మాజీలు అయిపోతున్నారు. అయినా కేసుల పరంపర తగ్గడం లేదు. దీంతో వారి భవిష్యత్ సజావుగా సాగుతున్నా కేసుల విచారణలో మాత్రం వేగం కనిపించడం లేదు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. ఇకపై రాజకీయ నాయకుల కేసులు పెండింగులో ఉంచకుండా విచారణ చేపట్టాలని భావిస్తున్నాయి.

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల విచారణలో వేగం పెంచేందుకు చర్యలు చేపట్టాలని కింది కోర్టులను ఆదేశించింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసు విచారణను ఇకపై రోజువారీగా చేపట్టేందుకు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జగన్ కేసు ఇకపై వేగంగా విచారణ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
జగన్ తోపాటు అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వారి కోసం రోజువారీ విచారణ జరగనుంది. దీంతో కేసు త్వరగా తేలేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జగన్ పై దాదాపు 40 వ్యాజ్యాలు విచారణలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు తనకు వారం రోజుల గడువు కావాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరినట్లు తెలుస్తోంది.
Also Read: AP Cabinet key decisions: ఏపీ కేబినెట్ సంచలనాలు: ఆన్ లైన్ టికెటింగ్.. 4వేల ఉద్యోగాలపై కీలక నిర్ణయం
సుప్రీంకోర్టు ఆదేశానుసారం ప్రతిరోజు విచారణకు రావాల్సిందేనని హైకోర్టు సూచిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలపై ఉన్న కేసుల వివరాలు వెల్లడించింది. అరబిందో ఫార్మా, హెటిరో ఫార్మా లిమిటెడ్ కు భూ కేటాయింపుల్లో అవకతవకలు, క్విడ్ ప్రోకో కేసులపై మొదట విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు. రోజు వారీ కేసులతో విచారణకు రావడం నేతలకు ఇబ్బందే మరి.
Also Read: AP Govt: అదానికి 130 ఎకరాలు అప్పగించేసిన జగన్ సర్కార్