Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపారంలో దూసుకుపోతున్నాడు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) పేరుతో కొత్త సంస్థను స్థాపించాడు. ట్రూత్ సోషల్ పేరుతో మెసేజింగ్ యాప్ ను తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సంస్థ ట్విటర్, ఫేస్ బుక్ కు పోటీ కానుందని చెబుతున్నారు. దీంతో వ్యాపార రంగంలో తానేమిటో నిరూపించుకోవాలని ట్రంప్ తాపత్రయ పడుతున్నారు. వారెంట్ కన్ వర్టబుల్ ద్వారా వచ్చే మూడేళ్లలో 40 మిలియన్ షేర్లు సృష్టించేందుకు సిద్ధమైంది. దీంతో అమెరికాలో అత్యంత వేగంగా విస్తరించేందుకు తన సత్తా చాటుతోంది.

ట్రంప్ సంస్థకు దాదాపు 90 మిలియన్ బోనస్ షేర్లు లభించే అవకాశాలున్నాయి. వీటి విలువ వేల కోట్లకు పైగా ఉండనుందని తెలుస్తోంది. ట్రంప్ కంపెనీకి 2.4 మిలియన్ డాలర్లు బోనస్ గా సమకూరనుంది. దీంతో ట్రంప్ నూతన సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలుస్తోంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించనట్లయింది.
ఇప్పటికే పలు కంపెనీల షేర్లు పెట్టుబడిగా పెట్టినట్లు సమాచారం. బోనస్ షేర్లకు అదనంగా కంపెనీ విలీనం ద్వారా మరో 87 మిలియన్ల షేర్లు ట్రంప్ సొంతం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటి విలువ సుమారు 5.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో ట్రంప్ వ్యాపారం దూసుకుపోతోందని నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు.
Also Read: అగ్రరాజ్యాల అస్త్రశస్త్రాల పెంపు
ఈ క్రమంలో ట్రంప్ వ్యాపారం దూసుకుపోవడంతో ఆయన మరోమారు తన సత్తా నిరూపించుకుంటున్నారు. తానేమిటో చెబుతున్నారు. తనకు తిరుగులేని విధంగా వ్యాపారం కొనసాగడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో కంపెనీని మరింత డెవలప్ మెంట్ చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Coronavirus: ప్రపంచాన్ని మరోసారి కబళించడానికి వస్తున్న కరోనా