https://oktelugu.com/

Actress Amala Paul: ప్రొడ్యూసర్‌‌గా అమలపాల్… అదిరిన పోస్టర్

Actress Amala Paul: దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన పలు హీట్ చిత్రాల్లో నటించిన అమలాపాల్ కొత్తగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. తన పేరు మీద అమలాపాల్ ప్రొడక్షన్స్​ అంటూ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. గత 12 ఏళ్లుగా చిత్రసీమలో కొనసాగుతున్నానని, ఈ పుష్కరకాలంలో తన కేరీర్ ఎంతో ఉజ్వలంగా సాగిందని.. ఇప్పుడు కౌత్త మార్గంలో పయనం ప్రారంభిచానని అమలాపాల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. హీరోయిన్లంతా నిర్మాతలవుతున్నారు. ఓవైపు నటిస్తూనే మరోవైపు ప్రొడక్షన్‌లోకి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 28, 2021 / 06:04 PM IST
    Follow us on

    Actress Amala Paul: దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన పలు హీట్ చిత్రాల్లో నటించిన అమలాపాల్ కొత్తగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. తన పేరు మీద అమలాపాల్ ప్రొడక్షన్స్​ అంటూ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. గత 12 ఏళ్లుగా చిత్రసీమలో కొనసాగుతున్నానని, ఈ పుష్కరకాలంలో తన కేరీర్ ఎంతో ఉజ్వలంగా సాగిందని.. ఇప్పుడు కౌత్త మార్గంలో పయనం ప్రారంభిచానని అమలాపాల్ సోషల్ మీడియాలో వెల్లడించింది.

    హీరోయిన్లంతా నిర్మాతలవుతున్నారు. ఓవైపు నటిస్తూనే మరోవైపు ప్రొడక్షన్‌లోకి దిగి నాలుగు కాసులు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్‌ నుంచి అప్‌కమింగ్ హీరోయిన్ అవికా గోర్ వరకు ఇదే పాలసీని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అమలా పాల్ కూడా అదే స్టెప్‌ వేసి సర్‌‌ప్రైజ్ చేసింది.

    మొదట్లో గ్లామర్ హీరోయిన్‌గా మాత్రమే కనిపించిన అమల.. రూటు మార్చి డిఫరెంట్‌ కాన్సెప్టుల్ని ఎంచుకుంటోంది. ముఖ్యంగా థ్రిల్లర్స్‌పై ఇంటరెస్ట్ చూపిస్తోంది. రీసెంట్‌గా చేసిన ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ థ్రిల్లరే. ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్‌‌ మూవీతోనే నిర్మాతగా తొలి అడుగు వేస్తోంది. అనూప్ ఎస్ ప్యానికర్ డైరెక్టర్‌‌ చేస్తున్న ‘కడావర్‌‌’ను నిర్మిస్తూ లీడ్ రోల్ చేస్తోంది అమల. తన పుట్టినరోజు సందర్భంగా పోస్టర్‌‌ను రిలీజ్ చేశారు. మార్చురీలో శవాల మధ్య కూర్చుని భోజనం చేస్తోంది అమల. పక్కనే ఓ గాజు సీసాలో కట్ చేసిన అవయవాలు కూడా ఉన్నాయి. ఒళ్లు గగర్పొడిచేలా ఉన్న ఈ పోస్టర్‌‌కి సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.