ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టు ధర ఎంతంటే?

రాష్ట్రంలో కరోనా కేసులు విభృంభిస్తుండటంతో ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్-19కు చికిత్స చేసేందుకు అనుమతినిచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు, చికిత్సలకు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. కరోనా టెస్టులను ఏవిధంగా చేయాలని, చికిత్స సంబంధించిన పలు సూచనలను ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు సూచించింది. కరోనా టెస్టులకు సంబంధించి రోగుల నుంచి ఎంతవరకు వసూలు చేయాలనే ధరను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ […]

Written By: Neelambaram, Updated On : June 15, 2020 3:08 pm
Follow us on


రాష్ట్రంలో కరోనా కేసులు విభృంభిస్తుండటంతో ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్-19కు చికిత్స చేసేందుకు అనుమతినిచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు, చికిత్సలకు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. కరోనా టెస్టులను ఏవిధంగా చేయాలని, చికిత్స సంబంధించిన పలు సూచనలను ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు సూచించింది. కరోనా టెస్టులకు సంబంధించి రోగుల నుంచి ఎంతవరకు వసూలు చేయాలనే ధరను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పలు మార్గదర్శకాలను విడుదల చేశారు.

తెలంగాణలో ప్రైవేట్ ల్యాబుల్లో కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి రూ.2200గా ధర నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే టెస్టులను నిర్వహించాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు కరోనా టెస్టులు చేయాలని లక్షణాలు లేనివారికి టెస్టులు చేయొద్దని తెలిపారు. ఏ మాత్రం కరోనా అనుమానం ఉన్నా రోగికి ప్రభుత్వం ఆధ్వర్యంలో టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ అని తేలి, లక్షణాలు లేకపోతే హోం ఐసోలేషన్లో ఉంచాలన్నారు.

కరోనా పాజిటివ్ అని తేలినవారికి రోజుకు రూ.4 వేలు వసూలు చేయాలన్నారు. అదేవిధంగా వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్స పొందితే రోజుకు రూ.7500, వెంటిలేటర్ మీద ఉన్నవారికి రోజుకు రూ.9 వేల చొప్పున మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలన్నారు. అదేవిధంగా వెంటిలేటర్‌పై ఉన్నవారికి, ఐసీయూలో ఉన్నవారికి యాంటీ వైరల్ డ్రగ్‌ ఇస్తే అదనపు ఛార్జీలు వసూలు చేయొచ్చని మంత్రి పేర్కొన్నారు. కొన్ని యాంటీ వైరల్ ఇంజక్షన్లు రూ.50వేల వరకు ఖరీదు చేస్తున్నాయని వీటికి ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. టెస్టులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో వైద్యులు నమోదు చేయాల్సి ఉంటుందని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో రోజుకు 4,500 కరోనా టెస్టులు చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. త్వరలోనే ఈ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపారు.