Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యవహారం మరోమారు చర్చనీయాంశం అవుతోంది. శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ రోడ్డు మార్గం, రైలు మార్గాల ద్వారా గమ్యం చేరుకోవడం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే సీఎం, గవర్నర్ విషయంలో విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఆమె పర్యటన మరోమారు వివాదాలకే కేంద్ర బిందువు కానుంది. ఈ మేరకు గవర్నర్ కు హెలికాప్టర్ సమకూర్చాల్సిన ప్రభుత్వం తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడం తెలిసిందే. దీంతో ఆమె సాధారణ వ్యక్తి లాగా రైలు, రోడ్డు మార్గాల గుండా భద్రాచలం చేరుకుని రాములోరి సేవలో పాల్గొనడం విశేషం.
గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో టీఆర్ఎస్ ఆమెను లక్ష్యంగా చేసుకుంటోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు విషయంలో గవర్నర్ ఆయన ఎన్నికపై ఫైల్ పక్కన పెట్టడంతో అప్పటి నుంచి గవర్నర్ పై కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారి మధ్య ఎడం పెరిగిపోయింది. ఇప్పుడు అది మరింత దూరం అయింది.
గవర్నర్ శ్రీరాముల పట్టాభిషేకానికి భద్రాచలం వెళ్లడంతో ఆమెకు హెలికాప్టర్ కేటాయించకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి ఆమెకు ఇవ్వాల్సిన మర్యాదలో భాగంగా హెలికాప్టర్ మంజూరు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేసీఆర్ తీరు వివాదాస్పదమవుతోంది. భవిష్యత్ లో ఇంకా ఏం పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం రైలు మార్గం ద్వారా అనంతరం రోడ్డు మార్గంలో భద్రాద్రి చేరుకోవడం గమనార్హం.
Also Read: ఢిల్లీపై గులాబీ దండయాత్ర.. కేసీఆర్ రైతు దీక్ష
ఇప్పటికే గవర్నర్ సీఎం వ్యవహారం ఢిల్లీకి చేరడంతో ఇక తాడోపేడో తేల్చుకునేందుకే ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇద్దరు కలిసి నడిచే అవకాశాలు లేవు. దీంతో ఆమె ఇక ఇక్కడ ఉండలేననే సంకేతాలు ఇస్తున్నారు. దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. మొత్తానికి గవర్నర్ సీఎం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో మనస్పర్థలు పెరిగినట్లు సమాచారం.
అయితే తమిళిసై విషయంలో కేసీఆర్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే దానిపై స్పష్టత లేదు. గవర్నర్ ను కావాలనే దూరం పెడుతున్నట్లు చెబుతున్నారు. ఒక మహిళపై ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రవర్తించడంపై అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది.