Dissatisfaction in YCP: పదవి పీకేస్తే ఊరుకుంటారా.. కొందరిని ఉంచి మిగతా వారిని తీసేస్తే భగ్గుమనరా.. తమకు కాకుండా వేరే వారికి మంత్రి పదవి ఇస్తే అసంతృప్తి అంటుకోదా.. ఏ పార్టీ అయితే ఏంటి.. ఎవరుంటే ఏంటి.. ఏ రాజకీయ నాయకుడికి అయినా కావాల్సింది పదవే కదా. అదే ఇప్పుడు ఏపీలోని వైసీపీలో మంటలు రేపుతోంది. అందరూ ఊహించనట్టుగానే వైసీపీలో రెబల్స్ తమ తడాఖా చూపిస్తున్నారు.

11మందిని ఉంచి 14 మంది కొత్తవారిని తీసుకోవడంతో.. తమకెందుకు ఇవ్వట్లేదని దాదాపు 11మంది రెబల్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. ఇక మంత్రి పదవి తీసేసిన సుచరిత అయితే ఏకంగా రాజీనామా సమర్పించారు. ఇంకోవైపు మంత్రి పదవి రాని వారు ఈరోజు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇందులో చాలామంది ఈ రోజు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.
జగన్ బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు ఇవ్వకుండా ఆదిమూలపు సురేష్ ను కేబినెట్ లో కంటిన్యూ చేయడంపై ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆయన కీలక నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
అటు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రగిలిపోతున్నారు. ఆయన వర్గం ఇప్పటికే నిరసనలు తెలుపుతోంది. ఆయన కూడా ఈ రోజు మీడియా ముందుకు రాబోతోంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభాను, అలాగే కొలుసు పార్థసారధి తమ అనుచరులతో నిరసనలు చేయిస్తున్నారు.
Also Read: ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం .. షాకిచ్చిన అసంతృప్తి నేతలు
ఇలా చాలామంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో తమ అనుచరులతో నిరసనలు తెలియజేస్తున్నారు. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పార్టీలో అగ్గి రాజేశారు. ఇందులో ఎంతమంది పార్టీకి వ్యతరేకంగా మారుతారో తెలియని పరిస్థితి. అయితే సజ్జల రామకృష్నారెడ్డి వీరిని బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కావట్లేదు.
కాబట్టి స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగితేనే ఈ అసంతషృప్తి జ్వాలలు తగ్గేలా ఉన్నాయి. ఆయన ఏదైనా పెద్ద హామీ ఇస్తే తప్ప వారు వెనక్కు తగ్గేలా లేరు. మరి ఎంత మందికి ఆయన హామీ ఇస్తారు. అది కూడా ఇక్కడ పాయిటే. ఇప్పటి వరకు జగన్ మాటే శాసనంగా భావించిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు రెబల్స్ గా మారడం అంటే మామూలు విషయం కాదు. మరి వారిని బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటారా లేక చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.
Also Read: ముగిసిన ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం.. కాసేపట్లో శాఖల కేటాయింపు..!
[…] Also Read: భగభగలు.. వైసీపీలో 11మంది అసంతృప్తి… […]