SS Rajamouli: ‘రాజమౌళి’ తర్వాత స్టార్ హీరోలందరూ సినిమా చేయడానికి ట్రై చేస్తున్న ఏకైక డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’. బన్నీ, మహేష్, చరణ్ కూడా పోటీ పడ్డారు. వీరికంటే ఇంకా ముందు ఉన్నారు ప్రభాస్, ఎన్టీఆర్. ఇక తమిళ నుంచి విజయ్, హిందీ నుంచి ‘రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్’లు కూడా ఇప్పటికే ప్రశాంత్ నీల్ ను అప్రోచ్ అయ్యారు. ఈ స్థాయిలో డిమాండ్ ఉంది ఆయనకు.

కారణం ‘కేజీఎఫ్’.. అవును ఇది సినిమా మాత్రమే కాదు, షార్ప్ టేకింగ్ కి, టైట్ స్క్రీన్ ప్లేకి మధ్య జరిగిన సంఘర్షణ మయం. ప్రతి సీన్ ను ఎమోషన్స్ తో డ్రైవ్ చేస్తూ.. ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ గ్రౌండ్ పెట్టి సినిమా తీయడం.. పైగా పదికి పైగా యాక్షన్ సీక్వెన్సెస్ ను పెట్టడం అంటే.. మాటలు కాదు, అనితరసాధ్యం. కానీ ప్రశాంత్ నీల్ సాధించి చూపించాడు.

అందుకే ఒక్క సినిమాతోనే నేషనల్ స్టార్ డైరెక్టర్ గా ఫుల్ డిమాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం సలార్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పై ఓ ఆసక్తికరమైన అప్ డేట్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది.
ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఆమెతో చర్చలు కూడా జరిపాడు. దీపికా కూడా ఎన్టీఆర్ సరసన నటించడానికి అంగీకరించింది. దీపికా కారణంగా బాలీవుడ్ లో ఈ సినిమా పై ఆసక్తి డబుల్ అవుతుంది. ఇక ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అని, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో జరిగిన కొన్ని పరిస్థితుల ఆధారంగా కథ మొదలవుతుంది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం పైనే కమల్ హాసన్ తన “విశ్వరూపం” సినిమా తీశాడు. ఆ యుద్ధంలో కొన్ని ఊహించిన పరిణామాలు జరిగాయని కొందరి వాదన. అయితే, కమల్ మాత్రం తన సినిమాలో కేవలం కొన్ని మాత్రమే చూపించాడు. అందుకే, ప్రశాంత్ నీల్ ఆ నేపథ్యంలో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు నష్టాల ప్రళయం !
కథ విషయానికి వస్తే.. అల్ ఖైదా, డర్టీ బాంబు లాంటి క్లిష్టమైన, కష్టమైన అంశాలను ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా ప్రభావితం చేసి వాటిని లేకుండా చేశాడు అనేది మెయిన్ కథ. కథ చాలా మలుపులు తిరుగుతుంది. అయితే, ఇక్కడ ఒక సమస్య ఉంది. మన సగటు ప్రేక్షకులకి ఏ మాత్రం ఎక్కని కథ ఏదైనా ఉందా అంటే.. అది ఈ తీవ్రవాదులపై తీసే కథలే.
నేతి బీరకాయలో నేయి ఎంత ఉంటుందో.. తీవ్రవాదుల నేపథ్యంలో వచ్చే చిత్రాల్లో ఎమోషన్ అంత ఉంటుంది. మరి ఎన్టీఆర్ ఈ కథనే చేస్తాడో లేక మరో కథ పై ఆసక్తి చూపిస్తాడో చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్ 2’ హంగామా నడుస్తోంది. ఈ సినిమా కూడా హిట్ అయితే.. ఇక ప్రశాంత్ నీల్… రాజమౌళికి గట్టి పోటీ ఇచ్చినట్టే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజమౌళికి పోటీ ఇచ్చే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రమే.
Also Read: తల్లి కాబోతున్న ‘పవన్ కళ్యాణ్’ హీరోయిన్ !
[…] Also Read: ‘రాజమౌళి’కి పోటీ ఇచ్చే ఏకైక డైరెక్టర… […]