సిఫారసు ఉంటేనే కరోనా టెస్ట్

తెలంగాణాలో ప్రజలు స్వచ్చందంగా కరోనా టెస్టుల కోసం ముందుకు వస్తుండడం వలన అధికారులు టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు ,కొన్ని టెస్టింగ్ కేంద్రాలలో టోకెన్ల కోసం పైరవీలు కూడా జరుగుతున్నాయి , అధికార పార్టీ నేతలు సిఫారసు చేసినవారికే టోకెన్లు ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.జిల్లా కేంద్రాలలో పరిమిత సంఖ్యలో టోకెన్లు ఇస్తున్నందువల్ల ప్రజలు తెల్లవారుజామునుండే క్యూ లైన్లో వేచివుండవలసి వస్తున్నది. అధికారులు , ప్రభుత్వం చెబుతున్న కరోనా లెక్కలు దాదాపుగా 63వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా ,కోలుకున్నవారు […]

Written By: admin, Updated On : August 3, 2020 4:57 pm
Follow us on

తెలంగాణాలో ప్రజలు స్వచ్చందంగా కరోనా టెస్టుల కోసం ముందుకు వస్తుండడం వలన అధికారులు టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు ,కొన్ని టెస్టింగ్ కేంద్రాలలో టోకెన్ల కోసం పైరవీలు కూడా జరుగుతున్నాయి , అధికార పార్టీ నేతలు సిఫారసు చేసినవారికే టోకెన్లు ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.జిల్లా కేంద్రాలలో పరిమిత సంఖ్యలో టోకెన్లు ఇస్తున్నందువల్ల ప్రజలు తెల్లవారుజామునుండే క్యూ
లైన్లో వేచివుండవలసి వస్తున్నది.

అధికారులు , ప్రభుత్వం చెబుతున్న కరోనా లెక్కలు దాదాపుగా 63వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా ,కోలుకున్నవారు 36 వేలు, రాష్టంలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా టెస్టులు నామమాత్రంగానే చేస్తుండడం , పైగా వాటి ఫలితాలు ఆలస్యంగా వస్తుండడం వలన రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల యాంటిజెన్టె స్టులు చెయ్యాలని సర్కారు భావిస్తున్నది , దీనికోసం ఇప్పటికీ నాలుగు లక్షల
కిట్లను సిద్ధం చెయ్యగా మరో లక్ష కిట్లు కోసం ఆర్డర్ చేసింది.

Also Read: తెలంగాణలో కరోనా.. ఆశ్చర్యపోయే లెక్కలు

భారత దేశంలో కరోనా ఉదృతంగా వ్యాపిస్తుంది,కరోనా కట్టడికి ప్రభుత్వాలు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాయి.చాల ప్రాంతాలలో కరోనా పరీక్షలు జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి , జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో శానిటైజేషన్ కూడా చేయట్లేదని ప్రజలు వాపోతున్నారు , కోట్ల జనాభా కలిగిన దేశంలో వేలల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారు , హాస్పటల్స్ అన్నిసాకార్యాలతో సిద్ధంగా వున్నాయి
అని అధికారులు , ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడం చాల విడ్డురంగా వుంది . వాస్తవ పరిస్థితి చాల భిన్నంగా వుంది , రోజు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి,మరణాల సంఖ్య కూడా అధికంగానే వుంది .

తెలంగాణ వ్యాప్తంగా 320 కేంద్రాలలో యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు, అంటే 320 కేంద్రాలలో కేవలం 50 టెస్టులు మాత్రమే చేస్తున్నారు , కొన్ని కేంద్రాలలో ల్యాబ్ టెక్నీషియన్ ల కొరత , ఇతర వైద్య సిబ్బంది పరిమిత సంఖ్యలో ఉండడం వలన కరోనా బాధితుల పాలిట శాపంగా మారింది. టెస్టుల కోసం వచ్చే వారికి టోకెన్ విధానం ప్రవేశపెట్టడం వలన అధిక సంఖ్యలో ప్రజలు క్యూ లైన్లో వేచి వుండవలసి వస్తున్నది, కరోనా సోకినా వ్యక్తి క్యూ లైన్లో ఉంటే ఎంత మందికి వైరస్ అంటుకుంటుందో చెప్పలేము, అధికారులు ఈ విషయాన్నీ గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు.

Also Read: జల వివాదాల పరిష్కారంపై ముఖం చాటేస్తున్న కేసీఆర్

ఇకనైనా ప్రభుత్వం మేలుకొని కరోనా టెస్టులకు సిఫారసు చేసేవారి పట్ల కఠినంగా వుంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన సిబ్బందిని నియమించి , వారికీ తగినన్ని పీ పీ ఈ కిట్లు సమకూర్చి వీలైనన్ని ఎక్కువ కరోనా టెస్టులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి , లేదంటే ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి కాకా తప్పదు