https://oktelugu.com/

వెండితెర పైకి హాట్ హాట్ జోడీ !

టీవీ కార్యక్రమాలను డైలీ ఫాలో అయ్యేవారిని టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించే మోస్ట్ హాట్ జోడీ ఎవరంటే కచ్చితంగా ముందు చెప్పే జోడీ ‘రష్మీ-సుడిగాలి సుధీర్’. పెద్దగా టీవీ చూడని వాళ్ళు అంటుంటారు..వీళ్లిద్దరికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. కానీ వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ముందు టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో వస్తోందట. ఇక వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలా రకాలుగా పుకార్లు వచ్చాయి. వాటిలో నిజానిజాలు పక్కన పెడితే […]

Written By:
  • admin
  • , Updated On : August 3, 2020 / 05:05 PM IST
    Follow us on

    టీవీ కార్యక్రమాలను డైలీ ఫాలో అయ్యేవారిని టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించే మోస్ట్ హాట్ జోడీ ఎవరంటే కచ్చితంగా ముందు చెప్పే జోడీ ‘రష్మీ-సుడిగాలి సుధీర్’. పెద్దగా టీవీ చూడని వాళ్ళు అంటుంటారు..వీళ్లిద్దరికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. కానీ వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ముందు టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో వస్తోందట. ఇక వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలా రకాలుగా పుకార్లు వచ్చాయి. వాటిలో నిజానిజాలు పక్కన పెడితే వీరిద్దర్నీ హీరోహీరోయిన్లుగా పెట్టి ఓ సినిమా తీయబోతున్నారు.

    Also Read: నయనతార అంతే.. నచ్చితేనే చేస్తోంది !

    గత సంవత్సరమే వీళ్ళతో సినిమా చేయడానికి చాలామంది వచ్చినా కథ నచ్చక ఒప్పుకోలేదట. మరి ఇప్పుడు కథ సెట్ అయినప్పుడు కూడా ఎందుకు మేమిద్దరం సిల్వర్ స్క్రీన్ పై కలిసి నటించికూడదు అని ఇద్దరూ దగ్గర ఉండి మరి, ప్రకాష్ అనే నూతన డైరెక్టర్ తో సినిమాని ఫైనల్ చేశారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా ఒక సినిమా చేశాడు. రష్మి కూడా హీరోయిన్ గా నాలుగైదు బి గ్రేడ్ సినిమాలు చేసింది.

    ఇప్పుడు త్వరలోనే వీళ్ళు కలసి ఒక సినిమా కూడా చేయబోతున్నారు. మరి బుల్లితెర పై లాగే వెండితెర పై కూడా ఈ జంట అలరిస్తుందేమో చూడాలి. ఏమైనా ఈ హాట్ జోడీని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చాన్నాళ్లుగా జరుగుతున్నా.. ఎట్టకేలకు ఇప్పటికి సెట్ అయింది. కాకపోతే వీళ్ళకు వెండితెర ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

    Also Read: అనసూయ బిజినెస్ మొదలెట్టేసింది !