https://oktelugu.com/

నయనతార అంతే.. నచ్చితేనే చేస్తోంది !

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..? పైగా సౌత్ హీరోయిన్లకు ఆ లక్కీ ఛాన్స్ వస్తే ఏం చేస్తారు ? ఏమైనా చేస్తాం అంటారు.. అవసరమైతే బికినీ షూట్.. ఇంకా అవసరం అయితే సెమీ న్యూడ్ కి కూడా సై అంటారు. కానీ ఒక్క సౌత్ హీరోయిన్ తప్ప. ఏదో ఎక్స్ పోజింగ్ విషయంలో మొహమాటం అనుకుంటే తప్పే.. ఆ మాటకొస్తే ఎక్స్ పోజింగ్ లో ఏ రేంజ్ కైనా […]

Written By:
  • admin
  • , Updated On : August 3, 2020 / 04:22 PM IST
    Follow us on


    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..? పైగా సౌత్ హీరోయిన్లకు ఆ లక్కీ ఛాన్స్ వస్తే ఏం చేస్తారు ? ఏమైనా చేస్తాం అంటారు.. అవసరమైతే బికినీ షూట్.. ఇంకా అవసరం అయితే సెమీ న్యూడ్ కి కూడా సై అంటారు. కానీ ఒక్క సౌత్ హీరోయిన్ తప్ప. ఏదో ఎక్స్ పోజింగ్ విషయంలో మొహమాటం అనుకుంటే తప్పే.. ఆ మాటకొస్తే ఎక్స్ పోజింగ్ లో ఏ రేంజ్ కైనా ఈ ముదురు ముద్దుగుమ్మ సిద్దమే. ఆమె ప్రేమల రాకుమారి ‘నయనతార’.

    Also Read: అనసూయ బిజినెస్ మొదలెట్టేసింది !

    నయనతారది ఎంతో విశాలమైన హృదయం.. అందుకే ప్రియుడు హ్యాండ్ ఇచ్చినా మరసటి రోజే మరో ప్రియుడిని దగ్గరకి తీసుకుని సేద తీరుస్తూ ప్రేమను పంచుతుంది, కాకపోతే పెళ్ళే చేసుకోదనుకోండి. ఇంతకీ మెయిన్ మ్యాటర్ లోకి వస్తే.. సల్మాన్ సినిమాలో నటించే అవకాశం వస్తే తిరస్కరించిందట. ఏ.. అమ్మా ఎందుకు అంటే.. రియాక్షన్ లేదట. హిందీ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరక్షన్ లో ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు సల్మాన్.

    ఈ ప్రాజెక్టులో ఎక్కువ భాగం చెన్నై ప్రాంతం ఉంటుందట. సొ.. మన హీరోగారు చెన్నై వచ్చినప్పుడు ఇక్కడ ఒకమ్మాయిని ప్రేమించి ఆమెతో నాలుగు సాంగ్స్ రెండు ముద్దు సీన్స్ పెడతాడు. దానికి నేటివిటికి తగ్గట్లు సౌత్ హీరోయిన్ ఉండాలి. సౌత్ లో ముదురు హీరోయిన్స్ లో స్టార్ డమ్ ఎవరికీ ఉంది అని చూస్తే.. ఎప్పుడో ముదిరిపోయినా ఇంకా స్టార్ డమ్ ను మెయింటైన్ చేస్తున్న నయనతార కనిపించింది.. వాళ్ళు సంప్రదించారు. కానీ నయనతార ఏ మూడ్ లో ఉందో గాని నో చెప్పేసింది.

    Also Read: గ్రేట్ ముసలి డైరెక్టర్ ని పట్టిన కుర్ర హీరోయిన్ !

    నయనతార కెరీర్ స్టార్టింగ్ లో ఐటమ్స్ సాంగ్స్ కూడా చేసింది. కానీ సొంతంగా మార్కెట్ అండ్ స్టార్ డమ్ వచ్చిన తరువాత.. స్టార్ హీరో సినిమా అయినప్పటికీ అన్ని నచ్చితేనే చేసేందుకు యస్ చెబుతుంది.. లేదంటే అన్సర్ కూడా చెయ్యదు ఈ ముదురు ముద్దుగుమ్మ. బాలయ్య సినిమాకి అలాగే చేసింది.