https://oktelugu.com/

పల్లెటూరోళ్లను కూడా వదలవా కేసీఆర్ సార్?

నగరాలంటే ఇరుకుగా ఉంటాయి. అక్కడ అర్థగుంట స్థలం కావాలంటే లక్షలు పోయాలి. అందుకే కబ్జాలు ఎక్కువ. మురికి కాలువలను కూడా కబ్జా చేసేసి అమ్మేస్తుంటారు.ఎల్ఆర్ఎస్ కేసుల్లో ఇలాంటివి ఎన్నో.. కానీ పల్లెటూళ్లు.. పట్టుకొమ్మలు.. అక్కడ విశాలమైన స్థలాలుంటాయి. ఆడుకునేంత ప్లేసు గ్రామాల్లో ఇంటి ముందర ఉంటుంది. ఒక్కొక్కరి ఇల్లు ఐదారు గుంటలు ఖచ్చితంగా ఉంటుంది. అయితే పల్లెటూర్లలో ఎవరూ దానికి పర్మిషన్ తీసుకొని ఎల్.ఆర్ఎస్ వేసుకొని ఇళ్లు కట్టుకోరు. తమ ఊరు.. తమ జాగా.. తమ హక్కు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2020 / 08:53 AM IST
    Follow us on

    నగరాలంటే ఇరుకుగా ఉంటాయి. అక్కడ అర్థగుంట స్థలం కావాలంటే లక్షలు పోయాలి. అందుకే కబ్జాలు ఎక్కువ. మురికి కాలువలను కూడా కబ్జా చేసేసి అమ్మేస్తుంటారు.ఎల్ఆర్ఎస్ కేసుల్లో ఇలాంటివి ఎన్నో.. కానీ పల్లెటూళ్లు.. పట్టుకొమ్మలు.. అక్కడ విశాలమైన స్థలాలుంటాయి. ఆడుకునేంత ప్లేసు గ్రామాల్లో ఇంటి ముందర ఉంటుంది. ఒక్కొక్కరి ఇల్లు ఐదారు గుంటలు ఖచ్చితంగా ఉంటుంది.

    అయితే పల్లెటూర్లలో ఎవరూ దానికి పర్మిషన్ తీసుకొని ఎల్.ఆర్ఎస్ వేసుకొని ఇళ్లు కట్టుకోరు. తమ ఊరు.. తమ జాగా.. తమ హక్కు అని ఇలా ఎవరికి వారే అనేసుకొని హద్దులు పెట్టుకొని అనాదిగా ఉంటారు.

    కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆదాయం కోసం పల్లెటూళ్ల మీద కూడా పడ్డ దుస్థితి నెలకొంది.తాజాగా కేసీఆర్ సర్కార్ ఓ ఘన కార్యం చేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లపై సర్వే చేసింది. పల్లెల్లో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంతో ఈ ఎత్తుగడ వేసింది.

    రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ కార్యదర్శులు చేసిన సర్వేలో కేవలం 24.5శాతం లేఅవుట్లు మాత్రమే సక్రమమని.. 25శాతం ప్లాట్లకే అనుమతులున్నాయని తేలింది. దీంతో గ్రామస్థుల నుంచి ఇప్పుడు ముక్కుపిండి అక్రమ లేఅవుట్లని డబ్బులు వసూలు చేయడానికి కేసీఆర్ సార్ రెడీ అయ్యారు.

    గ్రామాల్లో ఎక్కడ జాగా దొరికితే అక్కడ గుడిసో.. ఇళ్లో కట్టుకుంటారు. ఇలాంటివి ఎక్కువగా ఊరోళ్లకు తెలియదు. కానీ వారిని కూడా వదలకుండా కేసీఆర్ సార్ పిండేస్తుండడంతో ఇప్పుడు గ్రామాల్లో ఆందోళనకరంగా మారింది. గ్రామస్థులను కూడా వదలవా కేసీఆర్ సార్ అని పలువురు నిలదీస్తున్నారు.