రకుల్‌ని తెలంగాణ ప్రభుత్వం కాపాడుతోందట..! నిజమేనా?

ఎక్కడో ముంబైలో మొదలైన డ్రగ్స్‌ కేసు.. హైదరాబాద్‌కూ తాకడంతో ఇప్పుడు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లోనూ డ్రగ్స్‌ కేసు ప్రకంపనలు సృష్టించినా.. దానిని మెల్లమెల్లగా మట్టుబెట్టారు. వారం పది రోజులు హడావుడి చేసి పలువురు సినీ డైరెక్టర్లు, యాక్టర్స్‌ను పిలిచి ఎంక్వైరీ చేశారు పోలీసులు. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో ఆ కేసు మరుగునపడింది. ఇప్పుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారం.. మరోసారి టాలీవుడ్‌కూ అంటుకుంది. హీరోయిన్‌ […]

Written By: NARESH, Updated On : September 27, 2020 1:03 pm
Follow us on

ఎక్కడో ముంబైలో మొదలైన డ్రగ్స్‌ కేసు.. హైదరాబాద్‌కూ తాకడంతో ఇప్పుడు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లోనూ డ్రగ్స్‌ కేసు ప్రకంపనలు సృష్టించినా.. దానిని మెల్లమెల్లగా మట్టుబెట్టారు. వారం పది రోజులు హడావుడి చేసి పలువురు సినీ డైరెక్టర్లు, యాక్టర్స్‌ను పిలిచి ఎంక్వైరీ చేశారు పోలీసులు. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో ఆ కేసు మరుగునపడింది. ఇప్పుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారం.. మరోసారి టాలీవుడ్‌కూ అంటుకుంది. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ఎన్సీబీ అధికారులు పిలవడం విచారించడం జరిగింది.

Also Read: కేసీఆర్‌‌ ట్రాప్‌ చేశాడు.. డీఎస్ సంచలన వ్యాఖ్యలు

అయితే.. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఆమె పేరును లింక్ చేసి రాజకీయ ఆరోపణలకు దిగుతున్నారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ అయితే విచిత్రమైన ఆరోపణలు చేశారు. ముంబై డ్రగ్స్‌ కేసుతో హైదరాబాద్‌కు లింకులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. గతంలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసును తొక్కేశారని గుర్తు చేశారు. అంతటితో ఆగలేదు.. రకుల్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని మీడియాకు లేఖ రాశారు.

అయితే.. బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు రకుల్‌ను మాత్రమే కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నా.. అలా ఎందుకు ప్రయత్నిస్తున్నారో ఎక్కడా వివరించలేదు. తెలుగు సినిమాల్లో నటించినంత మాత్రాన రకుల్‌ను కాపాడాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటుందా..! పైగా రకుల్ తాను డ్రగ్స్ తీసుకున్నానని కూడా ఎక్కడా చెప్పడం లేదు. రెండేళ్ల కిందట చాట్ చేశానని చెప్పింది. అంతకుముందు ఎన్సీబీ వద్ద ఆధారాలు కూడా లేవని దర్యాప్తు అధికారులే చెబుతున్నారు. అటువంటప్పుడు.. కాపాడటం అనే ప్రశ్న ఎలా వస్తుందో సంపతత్‌కే తెలియాలి మరి.

Also Read: వామ్మో… అక్కడ మాస్క్ పెట్టుకోకపోతే కరెంట్ షాక్ ఇస్తారట!

ఈ వ్యవహారంలో రకుల్‌ ముందుగానే ఆచితూచి వ్యవహరించింది. తనపై మీడియాలో కానీ.. సోషల్‌ మీడియాలో కానీ నిరాధార కథనాలు రాకుండా నియంత్రించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇలాంటి రాజకీయాలను కూడా ఆమె గ్రహించి ఉంటుంది. అందుకే.. ముందస్తుగానే హైకోర్టుకు విన్నవించుకుంది. గతంలోనూ టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ఇప్పుడు ఈ సంపత్‌ వ్యాఖ్యలతో ప్రభుత్వం ఎలా స్పందిస్తో చూడాలి మరి..