https://oktelugu.com/

కేసీఆర్ డిసైడ్.. దసరాకే ముహూర్తం?

ఇప్పటికే రెవెన్యూ శాఖలో భారీ మార్పులు తీసుకొచ్చిన కేసీఆర్‌‌.. ఆ వెంటనే వీఆర్వో వ్యవస్థను వెంటనే రద్దు చేశారు. తర్వాత రిజస్ట్రేషన్ల విషయంలోనూ సమూలమైన మార్పుల కోసం దసరా ముహూర్తంగా నిర్ణయించారు. అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టే ముందే ప్రభుత్వం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఉద్యోగులకు సెలవులు ఇచ్చేసింది. అప్పట్నుంచి రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని చాలా మంది ఎదురుచూస్తూనే ఉన్నారు. కొంత మంది కాంగ్రెస్ నేతలు మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయాలని ధర్నాలు కూడా చేస్తున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2020 12:55 pm
    Follow us on


    ఇప్పటికే రెవెన్యూ శాఖలో భారీ మార్పులు తీసుకొచ్చిన కేసీఆర్‌‌.. ఆ వెంటనే వీఆర్వో వ్యవస్థను వెంటనే రద్దు చేశారు. తర్వాత రిజస్ట్రేషన్ల విషయంలోనూ సమూలమైన మార్పుల కోసం దసరా ముహూర్తంగా నిర్ణయించారు. అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టే ముందే ప్రభుత్వం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఉద్యోగులకు సెలవులు ఇచ్చేసింది. అప్పట్నుంచి రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని చాలా మంది ఎదురుచూస్తూనే ఉన్నారు. కొంత మంది కాంగ్రెస్ నేతలు మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయాలని ధర్నాలు కూడా చేస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం పక్కా ప్రణాళికతో ఉన్నారు.

    Also Read: రకుల్‌ని తెలంగాణ ప్రభుత్వం కాపాడుతోందట..! నిజమేనా?

    సీఎం కేసీఆరే స్వయంగా దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. దసరాలోపే ఈ పోర్టల్‌కు సంబంధించి అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్ విడ్త్‌లను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్ వినియోగంపై ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్‌లకు ఈ లోపే శిక్షణ ఇవ్వనున్నారు. వారికి విధుల్లో సహాయకంగా ఉండేందుకు ప్రతి సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌ని నియమిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీల విషయంలోనూ మార్పులు తీసుకొస్తున్నారు. సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయిస్తారు. డాక్యుమెంట్ రైటర్స్‌కు కూడా లైసెన్సులు ఇచ్చి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

    ప్రస్తుతం ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. దీని ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం ఆన్‌లైన్‌లో లేని వాటిని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. దసరాలోపే అన్ని రకాల ఆస్తుల డేటా పోర్టల్‌లో నమోదు చేసి.. తర్వాత రెవెన్యూ వ్యవహారాలు ప్రారంభించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. దీంతో మరో నెల పాటు తెలంగాణలో ఎలాంటి భూ లావాదేవీలు జరిగే అవకాశం లేదు.

    Also Read: కేసీఆర్‌‌ ట్రాప్‌ చేశాడు.. డీఎస్ సంచలన వ్యాఖ్యలు

    ఇప్పటికే పలువురు ప్లాట్లు కొనుక్కొని.. ఇళ్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తుండగా.. ప్రభుత్వం చర్యలతో మరో నెల ఆగాల్సి వస్తోంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, భూముల వివరాలు పక్కాగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టానికి తెరతీసింది.