కాంగ్రెస్ పార్టీని మరింత బలహీన పరిచేందుకే తనను సీఎం కేసీఆర్ ట్రాప్ చేసి పావులా వాడారని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) ఆరోపించారు. టీడీపీ నుంచి కూడా చాలా మంది నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని, పదవులు ఇచ్చి గాలికి వదిలేశారని విమర్శించారు. డీఎస్ 73వ జన్మదినం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంలేదని టీఆర్‌ఎస్ కార్యకర్తలూ మధనపడుతున్నారని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
Also Read: రకుల్‌ని తెలంగాణ ప్రభుత్వం కాపాడుతోందట..! నిజమేనా?
‘అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్‌కు కవిత ఫిర్యాదు చేసింది. నేను పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి. లేదంటే పిలిచి మాట్లాడాలి. కొంతమంది ఒత్తిడి వల్లే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. పార్టీని వీడడం పొరపాటే. కేసీఆర్ స్వయంగా ఫోన్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్న. అరేండ్లుగా రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి పోతోంది. స్కీమ్‌లతోనే ఓట్లు తెచ్చుకోవాలనే పాలన సాగుతోంది. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోంది’ అంటూ మండిపడ్డారు.
‘నేను మౌనంగా ఎందుకు ఉన్నానో మీరే ఆలోచించాలి. నేను మౌనంగా ఉండే వ్యక్తిని కాదు. నా మౌనం.. మౌనం కాదు.. వ్యూహాత్మక మౌనహా అంటే అవసరాన్ని బట్టి స్పందిస్తాను. నాకు కాంగ్రెస్‌లోనూ అన్యాయం జరిగింది. నేను, వైఎస్, పార్టీ సీనియర్లతో కలిసి కాంగ్రెస్‌ను అధికరంలోకి తెచ్చినం. ఆ వాస్తవాన్ని సోనియా కూడా గ్రహించారు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఫుల్ ఫిల్ చేయలేదు. వైఎస్ సీఎం అన్ని ఎన్నికల ముందే సోనియా నాకు చెప్పారు. తర్వాత నేను, వైఎస్ ఎంతో సన్నిహితంగా ఉన్నాం. 2009 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చాం. కానీ.. బ్యాడ్ లక్‌తో నేను ఓడిపోయాను. లేదంటే నేనే సీఎం అయ్యేవాడిని’ అని అన్నారు.
Also Read: వామ్మో… అక్కడ మాస్క్ పెట్టుకోకపోతే కరెంట్ షాక్ ఇస్తారట!
‘టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ ఎవరినీ ఉండనివ్వడు. తానే ఉండాలనుకుంటాడు. టీడీపీ, కాంగ్రెస్‌లో గెలిచిన వాళ్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటడు. పార్టీని మెర్జ్ చేయించుకుంటడు. అదే ఆయన చాకచక్యం. ఇప్పుడు పాలన ఎలా ఉందో అందరికీ అర్థమవుతోంది. నేను రాజకీయాల నుంచి రిటైర్ కాను. చనిపోతేనే రిటైర్‌మెంట్. తెలంగాణ పోరాటంలో నా రోల్ ఏంటో కేసీఆర్‌కు కూడా తెలుసు’ అని అన్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ ఎందుకు వీడుతా అంటూనే.. ఫ్యూచర్‌లో ఏ పార్టీలో చేరుతాననేది టైమ్ డిసైడ్ చేస్తదని చెప్పుకొచ్చారు. మోడీ పాలన బాగుందని మెచ్చుకున్నారు.