https://oktelugu.com/

తెలంగాణ.. ఓ గొప్ప విజయం!

  దశాబ్ధాల పాపం.. నేటికి కనుమరుగైంది.. క్రెడిట్ ఎవరిది అయితేనేం.. వారికి పాప ప్రక్షాళన అయ్యింది. తెలంగాణ సర్కార్ ఇది మా ‘మిషన్ భగీరథ’ సాధించిన క్రెడిట్ అంటోంది. మరోవైపు ప్రతీ ఊరికి వెలిసిన మినరల్ వాటర్ ప్లాంట్ల ద్వారానే ఈ ‘ఫ్లోరైడ్ భూతం’ ఖతమైందనే వారున్నారు. Also Read: దుబ్బాకలో రఘునందన్‌రావుకు సింపతి కలిసొచ్చేనా ఉమ్మడి నల్గొండ సహా తెలంగాణలో వందల ఫీట్లు బోర్లు వేసినా పడని పరిస్థితులుండేవి. తలాపునే కృష్ణా, గోదావరి నదులు పారుతున్నా తాగడానికి […]

Written By: , Updated On : September 19, 2020 / 09:28 AM IST
floride problem

floride problem

Follow us on

 

floride problem

దశాబ్ధాల పాపం.. నేటికి కనుమరుగైంది.. క్రెడిట్ ఎవరిది అయితేనేం.. వారికి పాప ప్రక్షాళన అయ్యింది. తెలంగాణ సర్కార్ ఇది మా ‘మిషన్ భగీరథ’ సాధించిన క్రెడిట్ అంటోంది. మరోవైపు ప్రతీ ఊరికి వెలిసిన మినరల్ వాటర్ ప్లాంట్ల ద్వారానే ఈ ‘ఫ్లోరైడ్ భూతం’ ఖతమైందనే వారున్నారు.

Also Read: దుబ్బాకలో రఘునందన్‌రావుకు సింపతి కలిసొచ్చేనా

ఉమ్మడి నల్గొండ సహా తెలంగాణలో వందల ఫీట్లు బోర్లు వేసినా పడని పరిస్థితులుండేవి. తలాపునే కృష్ణా, గోదావరి నదులు పారుతున్నా తాగడానికి నీళ్లు లేని రోజులుండేవి. ఉమ్మడి పాలనలో తెలంగాణకు తాగు, సాగునీటిలో గోస ఉండేది. ఆంతా ఆంధ్రా ప్రాంతానికే నీరు పారేది.

అందుకే నీటి చెలిమ లేక వందల మీటర్ల నుంచి నీటిని తొడితే విషం వచ్చేది. అదే ‘ఫ్లోరైడ్’. ఆ విషం తాగి నల్గొండ సహా దక్షిణ తెలంగాణలో ఎంతో మంది కాళ్లు, చేతులు మెలిగి తిరిగి బొంగుర్లు పోయి వికలాంగులు అయ్యేవారు. ఫ్లోరైడ్ కారణంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇలా కనిపించే అభాగ్యులు ఇప్పటికీ ఉన్నారు.

కానీ తెలంగాణ ఏర్పడ్డాక మార్పు వచ్చింది. కొత్త ప్రభుత్వం ‘ఫ్లోరైడ్ ’తొలగిస్తామని మాట ఇచ్చింది. మిషన్ భగీరథ తెచ్చింది. దాంతో ప్రాజెక్టులు కట్టి నీటి ఊటను పెంచింది. నీళ్లు పైకి వచ్చాయి. గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంటులు వెలిశాయి. దీంతో ఫ్లోరైడ్ భూతం తెలంగాణ నుంచి మాయమైంది.

Also Read: తెలంగాణ మహిళలకు కేసీఆర్ సర్ ప్రైజ్

అవును ఇది కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు లేవు. 2015 ఏప్రిల్ 1 నాటికి 967 ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలుండగా 2020 ఆగస్టు 1 నాటికి ఆ సంఖ్య సున్నాకు చేరిందని కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో ఏపీలో మాత్రం 402 ఆవాసాల నుంచి 111 ఆవాసాలకు  ఇది తగ్గింది.

అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఫ్లోరైడ్ ఖతమైంది. ఈ క్రెడిట్ ను మంత్రి కేటీఆర్ ఆయన ఖాతాలో వేసుకున్నా సరే.. ప్రజలకైతే మేలు జరిగింది. వారికి ఊరట కలిగింది.. ఈ విజయం ఎవ్వరిదైనా ప్రజలకైతే ఓ భయంకర పిశాచి నుంచి విముక్తి లభించిందనే చెప్పాలి.

-నరేశ్

Tags