https://oktelugu.com/

ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?

దేశంలో ఎంతటి వారైనా న్యాయ వ్యవస్థ తీర్పులను గౌరవించాల్సి ఉంటుంది. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖుల వరకు ఎక్కడ న్యాయం జరగకపోయినా కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తారు. కింది కోర్టులో ఏదైనా కారణం వల్ల కోర్టు తీర్పుపై సంతృప్తి వ్యక్తం కాకపోతే న్యాయం కోసం పై కోర్టును ఆశ్రయించవచ్చు. పలు సందర్భాల్లో న్యాయస్థానం వివాదాస్పద కేసుల్లో వెల్లడించిన తీర్పుల గురించి స్పందించడానికి ప్రముఖులు సైతం ఇష్టపడరు. Also Read : సీఐని బెదిరించిన వైసీపీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 19, 2020 / 09:21 AM IST
    Follow us on

    దేశంలో ఎంతటి వారైనా న్యాయ వ్యవస్థ తీర్పులను గౌరవించాల్సి ఉంటుంది. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖుల వరకు ఎక్కడ న్యాయం జరగకపోయినా కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తారు. కింది కోర్టులో ఏదైనా కారణం వల్ల కోర్టు తీర్పుపై సంతృప్తి వ్యక్తం కాకపోతే న్యాయం కోసం పై కోర్టును ఆశ్రయించవచ్చు. పలు సందర్భాల్లో న్యాయస్థానం వివాదాస్పద కేసుల్లో వెల్లడించిన తీర్పుల గురించి స్పందించడానికి ప్రముఖులు సైతం ఇష్టపడరు.

    Also Read : సీఐని బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే.. ఫోన్ సంభాషణ లీక్?

    అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం న్యాయ‌స్థానాల త‌ప్పొప్పుల‌పై ప్రశ్నిస్తోంది. మంగళవారం రోజున ఏపీ హైకోర్టు ఒక కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వ్యక్తులు, అందులోని అంశాలు మీడియాలో, సోషల్ మీడియాలో రాకూడదని ఆదేశించింది. అమవరాతి భూకుంభకోణం కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూతుళ్లు, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ పేర్లు వెలుగులోకి రావడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

    దీంతో వైసీపీ నేతలు హైకోర్టు న్యాయమూర్తులపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఏపీలో నిష్పాక్షికమైన తీర్పులు ఆశించలేమని… టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో లాయర్లుగా ఉన్నవాళ్లే ఇప్పుడు జడ్జీలుగా ఉన్నారని… రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొచ్చుకొస్తూ శాసన వ్యవస్థ నిర్మాణాన్ని దెబ్బ తీస్తోందని మిథున్ రెడ్డి అన్నారు.

    న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల తీర్పులు సక్రమంగా లేవని… శాసన వ్యవస్థ అధికారాల్లోకి న్యాయ వ్యవస్థ ప్రవేశించకపోతే దేశం ప్రగతి పథకం ముందుకెళుతుందని మిథున్ రెడ్డి అన్నారు. అయితే టీడీపీ కాలంలో లాయర్లే ఇప్పుడు జడ్జీలుగా ఉన్నారంటూ ఎంపీ చేసిన కామెంట్లు విచిత్రంగా ఉన్నాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

    Also Read : కేంద్రంలో వియ్యం.. రాష్ట్రంలో కయ్యం..