Telangana Formation Day: తెలంగాణలో రాజకీయ పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి సామాన్యుడికి అంతుబట్టని రీతిలో పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అటు కేంద్ర, ఇటు రాష్ర్ట ప్రభుత్వాలు పోటాపోటీగా నిర్వహించనున్నాయి రాష్ట్రంలో పబ్లిక్ గార్డెన్ లో సీఎం కేసీఆర్ పాల్గొనే వేడుకలకు ముస్తాబు అవుతోంది. మరోవైపు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు వేడుకలు నిర్వహించి తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నాయి. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో నామమాత్రంగా జరిపిన వేడుకలు ఈ సారి మత్రం అట్టహాసంగా సాగనున్నట్లు తెలుస్తోంది.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ర్టంలో బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా నిలుస్తున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెబుతుండటంతో దానికి చెక్ పెట్టేందుకే కేసీఆర్ మూడో కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని రెండు పార్టీలు ఆలోచిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయి. దీంతోనే అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ లో ఒకేసారి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.
Also Read: Divya Vani: దివ్యవాణి ఎందుకిలా చేసింది? టీడీపీలో ఉన్నట్టా? జగన్ కోవర్టా?
రాష్ట్రంలో పాగా వేయాలని రెండు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అందివచ్చే అవకాశాలను సానుకూలంగా మార్చుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం రాష్ర్ట ఆవిర్భావ వేడుకలను లక్ష్యంగా చేసుకున్నాయి కేంద్రం నిర్వహించే కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో జరిగే వేడుకల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తారని తెలుస్తోంది.
మొత్తానికి రాజకీయం కీలక మలుపులు తిరగనుంది. రెండు పార్టీలు తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నాయి. దీని కోసం పలు మార్గాలు అన్వేషిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుని ఆయన కనుసన్న్లలోనే నడుస్తోంది. ఆయన సూచించిన సలహాలు, సూచనలతో ముందుకెళ్తోంది. బీజేపీ అమిత్ షా నేతృత్వంలోనే వ్యూహాలు ఖరారు చేయనున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు కీలక దశకు చేరుకుంటున్నాయి. పార్టీల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తమకు అనుకూలంగా చేసుకోవాలని అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ రెండు పార్టీలు భావించడంతో ఏం జరుగుతుందో చూడాల్సిందే.
Also Read:Hardik Pandya: టీమిండియాకు మరో కపిల్ దేవ్ దొరికినట్టేనా?