తెలంగాణ డీజీపీ.. ప్లీజ్ హెల్ప్ అన్న బండ్ల గణేష్

తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లు ఆపుతున్న వైనం దుమారం రేపుతోంది. చాలా మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని తెలంగాణలోని హైదరాబాద్ కు వస్తుండగా.. వారందరినీ ఆపివేస్తున్నారు. దీనిపై హైకోర్టు హెచ్చరించినా.. ఏపీ ప్రభుత్వం, నేతలు అభ్యర్థించినా తెలంగాణ సర్కార్ మాత్రం వినడం లేదు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు బండ్ల గణేష్ తాజాగా ట్వీట్ చేశాడు. ఏపీ నుంచి తెలంగాణలోకి రానీయని ఓ ముస్లిం కుటుంబం కోవిడ్ రోగి బాధితురాలు చెబుతున్న వీడియోను బండ్ల గణేష్ […]

Written By: NARESH, Updated On : May 15, 2021 11:02 am
Follow us on

తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లు ఆపుతున్న వైనం దుమారం రేపుతోంది. చాలా మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని తెలంగాణలోని హైదరాబాద్ కు వస్తుండగా.. వారందరినీ ఆపివేస్తున్నారు. దీనిపై హైకోర్టు హెచ్చరించినా.. ఏపీ ప్రభుత్వం, నేతలు అభ్యర్థించినా తెలంగాణ సర్కార్ మాత్రం వినడం లేదు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు బండ్ల గణేష్ తాజాగా ట్వీట్ చేశాడు.

ఏపీ నుంచి తెలంగాణలోకి రానీయని ఓ ముస్లిం కుటుంబం కోవిడ్ రోగి బాధితురాలు చెబుతున్న వీడియోను బండ్ల గణేష్ షేర్ చేశారు. ఆంధ్రా రోగులం అని తెలంగాణ పోలీసులు తెలంగాణలోకి అనుమతించడం లేదని ఆ ముస్లిం యువతి వాపోయింది. వెంటిలేటర్ అవసరం ఉందని.. ప్లీజ్ దయచేసి తెలంగాణలోకి పంపించాలని ఆమె వేడుకుంది.

ఈ వీడియోను షేర్ చేసిన బండ్ల గణేష్ ‘సర్ ప్లీజ్ హెల్్ హిమ్ ’ అని తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేసి వీడియో షేర్ చేశారు. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా రోగులను వదిలేయాలని.. వారిని ఆస్పత్రులకు చేరనిచ్చి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ వాసులు కోరుతున్నారు.

https://twitter.com/ganeshbandla/status/1393066772966764545?s=20