నాగాలాండ్ లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేట్ పై 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మొలజీ తెలిపింది. మోకోక్చుంగ్ కు తూర్పున 74 కీలోమీటర్ల దూరంలో ఉదయం 5 గంటలకు భూ ప్రకటంపణలు వచ్చాయని, భకంప కేంద్రాన్ని 81 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని వివరించింది. అలాగే అసోంలో తేజ్ పూర్ లో సైతం ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్ సీ ఎన్ పేర్కొంది.