https://oktelugu.com/

Telangana Congress: రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి:కాంగ్రెస్ లో అసంతృప్తుల గోల.. పార్టీ భవిష్యత్ ఎలా?

Telangana Congress: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ముందు నుయ్యి వెనుక గొయ్యి గా మారింది పరిస్థితి. ప్రతిపక్షాలపై పోరాటం చేయాల్సిన సమయంలో సొంత పార్టీలోనే కుమ్ములాటలు కలచివేస్తున్నాయి. సీనియర్ నేతల తీరుతో విసిగిపోతున్నారు. భవిష్యత్ కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సీనియర్లతో తంటాలు పడాల్సి వస్తోంది. వీరి నిర్వాకంతో ఆయన పార్టీ కార్యక్రమాలపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉండడంతో పార్టీ కార్యక్రమాల్లో కలిసి రావడం […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 12, 2021 4:45 pm
    Follow us on

    Telangana Congress: Revanth vs Jagga Reddy, What is the future of the party

    Telangana Congress: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ముందు నుయ్యి వెనుక గొయ్యి గా మారింది పరిస్థితి. ప్రతిపక్షాలపై పోరాటం చేయాల్సిన సమయంలో సొంత పార్టీలోనే కుమ్ములాటలు కలచివేస్తున్నాయి. సీనియర్ నేతల తీరుతో విసిగిపోతున్నారు. భవిష్యత్ కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సీనియర్లతో తంటాలు పడాల్సి వస్తోంది. వీరి నిర్వాకంతో ఆయన పార్టీ కార్యక్రమాలపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉండడంతో పార్టీ కార్యక్రమాల్లో కలిసి రావడం లేదు.

    బీజేపీ, టీఆర్ఎస్ నేతలు హుజురాబాద్ పై ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం వెనుకబడిపోయింది. దీంతో రేవంత్ రెడ్డికి అసంతృప్తులనే బుజ్జగించేందుకే సమయం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తాజాగా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ఈసారి జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. గజ్వేల్ సభ ఎజెండాగా సాగిన ఈ సమావేశంలో సభ నిర్వహించాల్సిన తీరుపై ప్రధానంగా చర్చ జరిగింది.

    ఈ సభకు అతిథులను ఆహ్వానించే బాధ్యతలను సీఎల్పీ నేత భట్టి, మధు యాష్కీ లకు అప్పగించారు. గజ్వేల్ సభను విజయవంతం చేయాలని కోరారు. కానీ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై కినుక వహించడంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్ని విభేదాలతో రేవంత్ రెడ్డికి పార్టీ ఎదుగుదలపై దృష్టి పెట్టేందుకు అవకాశం కలగడం లేదని తెలుస్తోంది.

    తాజాగా జరిగిన సమావేశానికి జగ్గారెడ్డి హాజరు కాలేదు. దీంతో సాధారణ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా హుజురాబాద్ ఎన్నికలకు మాత్రం సమయం లేదు. కానీ నేతలు కలిసి రాకపోవడంతో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకు కార్యకర్తలు సరైన విధంగా రావడం లేదు. దీంతో రేవంత్ రెడ్డిపై పార్టీ ప్రక్షాళన బాధ్యత ఏమైనా పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు.

    దీంతో పీసీసీ భవిష్యత్ కార్యక్రమాలపై కొందరిలో అసంతృప్తి నెలకొందని తెలుస్తున్నా వారిని సరైన దారిలో పెట్టేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు దారులు వెతుక్కుంటుండగా ప్రస్తుతం అసంతృప్తుల గోల పెరుగుతోంది. మొత్తానికి 17న గజ్వేల్ లో నిర్వహించే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.