https://oktelugu.com/

Telangana Congress: మళ్లీ మునుపటి స్థితికి టీ కాంగ్రెస్..?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ మునుపటి స్థితికి వచ్చింది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక నూతనోత్తేజం వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. కానీ, అలా జరగడం లేదు. స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా పార్టీ దుస్థితి మరోసారి బహిర్గతమవుతున్నది. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై స్పెషల్ ఫోకస్.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2021 / 03:56 PM IST
    Follow us on

    Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ మునుపటి స్థితికి వచ్చింది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక నూతనోత్తేజం వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. కానీ, అలా జరగడం లేదు. స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా పార్టీ దుస్థితి మరోసారి బహిర్గతమవుతున్నది. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై స్పెషల్ ఫోకస్..

    Telangana Congress

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని శాసించే స్థాయిలో తామే ఉన్నామని పేర్కొనే నల్గొండ జిల్లా నేతలు ఆ జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రo పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పార్టీకి బలం ఉన్నప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని పేరుంది. కానీ, తర్వాత కాలంలో ఆ కోటకు బీటలు వారాయి. పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం, పార్టీ దిగ్గజం జానారెడ్డి నాగార్జున సాగర్‌లో ఓటమి పాలవడం, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకపోవడం కాంగ్రెస్ పార్టీ వరుస వైఫల్యాలను ఎత్తి చూపుతోంది.

    Also Read: కేసీఆర్ ను రాజకీయ సమాధి చేసేస్తాం.. బండి సంజయ్, తీన్మార్ మల్లన్న శపథం

    ఇక తెలంగాణ కాంగ్రెస్ గ్రూపు విభేదాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. వాటితోనూ పార్టీకి తీరని నష్టం జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ప్రతినిధులు 200 మందికిపైగానే ఉన్నారు. వీరందరినీ ఏకం చేసి ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టినట్లయితే అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా బదులిచ్చేవారు. అయితే, ఈ విషయమై పార్టీ అధినాయకత్వం కాని నల్లగొండ జిల్లా నేతలు కాని పట్టించుకోవడం లేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీటీసీ కుడుదుల నగేశ్, నల్లగొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. నగేశ్‌కు రేవంత్ వర్గీయుడిగా, లక్ష్మయ్యకు కోమటిరెడ్డి వర్గీయుడిగా పేరుంది. వీరిరువురు ఎవరికి వారు ప్రచారం చేసుకున్నారు. ఈ విషయమై పార్టీ పెద్దలు ఎందుకు దృష్టి సారించడం లేదని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమవుతున్నది.

    తెలంగాణ కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలను కొలిక్కి తీసుకురావడంలో నూతన టీపీసీసీ చీఫ్ కూడా విఫలమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టున్న జిల్లాలోనే ఇలా స్థానిక సంస్థల ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే వేరే జిల్లాల సంగతి ఎలా అని కొందరు అడుగుతున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే మొదలు ఆ పార్టీ నేతలు అందరినీ ఏకం చేయాలని కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఇలా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని కొందరు సూచిస్తున్నారు.

    Also Read: వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి చకచకా అడుగులు..

    Tags