Tollywood: ఈ మధ్య తెలుగు సినిమాల్లో కొత్త ఒరవడి మొదలైంది. ఎక్కువ ఆంగ్ల పదాలను అవసరం లేకపోయినా ఎలాగోలా ఇరికించి వాడుతున్నారు. ఎందుకయ్యా అంటే.. ? ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా ఉంటే.. సినిమా అంత ట్రెండీగా ఉంటుంది అంటూ సొల్లు కబుర్లు చెబుతున్నారు. మరి ఈ పోకడ, రచయితలలో పుట్టిందా ? లేక, స్వతహాగా నిర్మాతలు చెప్పి రాయించుకుంటున్నారా ? అనేది చూడాలి.
అయినా ఈ పోకడ తెలుగు భాషాభివృద్ధికి ఏ రకంగా సహాయ పడుతుంది ? అయినా కథకి సంబంధించినంత వరకు మాటల రచయిత తొలి ప్రేక్షకుడు మాత్రమే కాదు, తొలి విశ్లేషకుడు, తొలి విమర్శకుడు కూడా. మరి ఆ మాటల రచయితకే ఏది అవసరం ? ఏది అనవసరం ? అని తెలియకపోవడం విచిత్రమే. నిజానికి మాటల రచయిత కథకు మాటలు రాసి చెప్పేవరకూ నిర్మాతకు గానీ దర్శకునికి గానీ కథా ప్రయాణం అర్ధం కాదు.
ముఖ్యంగా పాత్రల గురించీ, వాటి స్వభావాల గురించి ఎలాంటి అవగాహన ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ.. లోతైన జ్ఞానం ఉండదు. ఇక స్క్రిప్ట్ అయిపోయాక, నిర్మాత గ్యాంగ్, దర్శకుడు, కథకుడు ప్రతి సీనులోనూ దర్జాగా వేలుపెడతారు. వాళ్ళల్లో సహజంగా ఉన్న అపోహ ఏమిటంటే.. ఏదైనా డైలాగ్ అచ్చ తెలుగులో ఉంది అనుకోండి. ఏంటండీ ? డైలాగ్స్ లో పాత వాసన కొడుతోంది ? అని అనగానే..
Also Read: KGF 2: అధీరా పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్ దత్
మాటల రచయిత నోట మాట రాదు. ఇక అతగాడికి ఇంగ్లీష్ రాకపోయినా ఎలాగోలా తోటి మిత్రుల సాయంతో ప్రతి సీన్ లో నాలుగు ఇంగ్లీష్ ముక్కులు యాడ్ చేసుకుంటూ ముందుకుపోతాడు. అవి సహజంగా ఉండవు. ఈ లోపు నిర్మాత, దర్శకుడు, చివరకు నటులు కూడా ఇలా ఎవరికి తోచినట్టు వారు పలురకాల కమర్షియల్ ఎలిమెంట్స్ చేర్చి దాన్నొక కిచిడీ లాగా తయారు చేస్తారు.
మరి ఆ కిచిడీలో టేస్ట్ ఎంతవరకు ఉంటుంది ? కాబట్టి రుచి ఆశించకపోవడం ఉత్తమం. అయినా ఇక్కడ ఇంకో ముచ్చట మాట్లాడుకోవాలి. స్క్రిప్ట్ కరెక్ట్ గా ఉన్నా… మధ్యలో బడ్జెట్ పేరు చెప్పి, నవ్యత పేరు చెప్పి, అన్ని వయసుల ప్రేక్షకులనూ ఆకర్షించాలని చెప్పి ఫైనల్ గా సీన్లలో రకరకాల తాళింపులు వేసి చివరకు మాడగొట్టడంలో మనోళ్లు మేధావులు.
Also Read: Balayya: బాలయ్యకు ఎందుకు అంత క్రేజ్ అంటే.. ?