https://oktelugu.com/

KGF 2: అధీరా పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేసిన సంజయ్ దత్

KGF 2: కన్నడ సినీ పరిశ్రమకు ఆణిముత్యం వంటి సక్సెస్ ని అలానే రాకింగ్ స్టార్ యశ్ సినీ ప్రయాణాన్ని మార్చిన చిత్రం” కేజిఎఫ్ “. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా “కేజీఎఫ్ చాప్టర్ 2” తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే పతాకంపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసుకుంది. హై ఓల్టేజ్ యాక్షన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 03:52 PM IST
    Follow us on

    KGF 2: కన్నడ సినీ పరిశ్రమకు ఆణిముత్యం వంటి సక్సెస్ ని అలానే రాకింగ్ స్టార్ యశ్ సినీ ప్రయాణాన్ని మార్చిన చిత్రం” కేజిఎఫ్ “. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా “కేజీఎఫ్ చాప్టర్ 2” తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే పతాకంపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసుకుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్స్ రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరొక అప్డేట్ వచ్చింది.

    Sanjay Dutt

    Also Read: త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి నిత్యా మీనన్…

    ఈ సినిమా డబ్బింగ్‌ పనులను పూర్తి చేశారు సంజయ్ దత్.సంజయ్ ఇందులో పోషిస్తున్న అధీరా పాత్ర చాలా హైలెట్‌గా నిలుస్తుందని ఇప్పటికే విడుదలైన ఆయన పోస్టర్ అలాగే టీజర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. కాగా సంజయ్ దత్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేసినట్టు తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

    ఇక ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగానూ ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది విడుదలయ్యే భారీ చిత్రాల్లో ఈ చిత్రానికి ఏ మేరకు విజయాన్ని అందుకుంటుందో అలానే హీరో యష్ తన సినీ ప్రయాణం ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూడాలి మరి.

    Also Read: నేను మళ్ళీ ఎలా షేప్ లోకి వచ్చానంటే.. ?

    Tags