Telangana Budget Session 2023: రాష్ట్ర శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి.. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు.. ఉభయ సభల సమావేశం మధ్యాహ్నం 12:10 నిమిషాలకు ప్రారంభమవుతుంది.. గవర్నర్ ప్రసంగం పూర్తికాగానే ఉభయ సభలు వాయిదా పడతాయి.. సాయంత్రం ఆయా రాజకీయ పార్టీల శాసనసభ పక్ష నేతలతో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది.. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను ఖరారు చేస్తారు. ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ సమావేశాలను 14వ తేదీ వరకు నిర్వహించే ఆలోచనలో ఉంది.

ఇప్పటికే ఈ విషయాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.. సభ పూర్వపు సంప్రదాయాల ప్రకారం గవర్నర్ ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. నాలుగున ఈ తీర్మాన ప్రవేశపెట్టి సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానానికి వివరణ ఇవ్వడంతో ముగించేస్తారు. ఐదున ఆదివారం సమావేశాలకు సెలవు ఉంటుంది.. ఆరో తేదీన రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు.. అనంతరం సభ్యుల అధ్యయనం కోసం సభకు రెండు రోజులపాటు విరామం ఇవ్వడం సంప్రదాయం.. అంటే ఏడు, ఎనిమిది తేదీల్లో సభకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. 9న మళ్లీ పున; ప్రారంభం కాగానే బడ్జెట్ పై చర్చ కొనసాగిస్తారు.. అధికార భారత రాష్ట్ర సమితి సభ్యులతో పాటు, విపక్షాలైన కాంగ్రెస్, బిజెపి, ఎం ఐ ఎం సభ్యులు మాట్లాడతారు.. ఏ పార్టీ ఎంత సేపు మాట్లాడాలనే వివరాలను బీఎసీలో నిర్ణయిస్తారు. సభ్యులు బడ్జెట్ పై లేవనెత్తిన సందేహాలు, సూచనలు, సలహాలకు సీఎం కేసీఆర్ లేదా ఆర్థిక మంత్రి హరీష్ వివరణ ఇస్తారు.
బడ్జెట్ పై చర్చను 9న ఒక్కరోజే నిర్వహిస్తారా లేక పదిన కూడా కొనసాగిస్తారా అన్నది తేడాల్సి ఉంటుంది.. 9వ తేదీన సభ్యుల ప్రసంగాలు పూర్తయితే అదే రోజు సాయంత్రం వివరణ ఇచ్చేసి, బడ్జెట్ పై చర్చ ముగించేస్తారు. లేదంటే 10న వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.. ఆ తర్వాత మూడు రోజులపాటు వివిధ శాఖల డిమాండ్లపై చర్చ కొనసాగిస్తారు.. ఈ డిమాండ్లపై ఎప్పటికప్పుడు మంత్రులు వివరణ ఇస్తారు.. 11, 13, 14 తేదీలలో ఇవి కొనసాగే అవకాశం ఉంది. 2023_24 ద్రవ్య వినిమయ బిల్లుకు 14న సభ ఆమోదం పొందుతారు.. రోజు గవర్నర్ ప్రసంగం కోసం శాసనసభ సచివాలయం ఏర్పాటు చేసింది.. హసన్ సభలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూర్చోవాల్సి ఉండడంతో సీటింగ్ ఏర్పాటు చేసింది.. ప్రస్తుతం శాసనసభలో నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్ సన్ తో కలిపి 120 మంది ఎమ్మెల్యేలు, మండలిలో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.
గవర్నర్ ఏం చెబుతారో
శాసనసభలో గవర్నర్ చేసే ప్రసంగంపై ఇప్పుడు సర్వత్ర ఆసక్తి ఉంది. రెండేళ్ల విరామం అనంతరం ఆమె మాట్లాడబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా అనేక ఆటంకాలు, ఇబ్బందులను తోసి రాజని ప్రసంగానికి అవకాశం వచ్చింది.. బిజెపి, బీ ఆర్ఎస్ మధ్య వైరం నెలకొన్న నేపథ్యంలో ప్రసంగం ఉండటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. నిజానికి గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించింది.. కానీ బడ్జెట్ ను ఆమోదించకుండా గవర్నర్ ప్రభుత్వ కోర్టులోకి బంతిని నెట్టారు.. దీంతో ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. బడ్జెట్ ఆమోదించేలా గవర్నర్ కు సూచించాలని కోరింది.. విషయంలో తమ జోక్యం చేసుకోబోమని, ఆదేశించబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజ్ భవన్, న్యాయవాదుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు గవర్నర్ ప్రసంగం ఖరారైంది.. తర్వాత గవర్నర్ బడ్జెట్ ముసాయిదాను ఆమోదించారు.. ఈ ప్రసంగం ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది.. నిజానికి ప్రభుత్వం తయారు చేసే ప్రసంగం కాపీనే గవర్నర్లు చదువుతూ ఉంటారు.. ఇందులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించే వాక్యాలు ఉంటే ఆమె చదువుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.. 2020లో ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.. 2021లో కోవిడ్ వల్ల ప్రసంగానికి అవకాశం లేకుండా పోయింది.. 2022లో ఆమె ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది.. ఈ ఏడాది కూడా అలాగే చేద్దాం అనుకున్నా దేవాదుల అంగీకారం మేరకు ప్రసంగాన్ని పెట్టాల్సి వచ్చింది.

అవకాశం ఇస్తారా
హైదరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఈసారైనా సభలో మాట్లాడే అవకాశం వస్తుందా అన్నది సందేహంగా మారింది.. గతంలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో ఆయన సమావేశంలో జరిగిన మూడు రోజులూ సభకు దూరంగా ఉన్నారు.. ఇప్పుడు ఆయన సభలో ప్రవేశిస్తే అధికారపక్షం నుంచి ఏవైనా ఆటంకాలు ఎదురవుతాయా అన్న చర్చ జరుగుతున్నది.
ఇక రాష్ట్ర బడ్జెట్ పై చర్చించేందుకు ఈనెల ఐదున రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆదివారం ఉదయం 10:30 నిమిషాలకు ప్రగతిభవన్లో కేబినెట్ జరగనుంది. ఈ సమావేశంలో 2023 24 వార్షిక బడ్జెట్ పై చర్చించి ఆమోదించనున్నారు.. అదే రోజు మహారాష్ట్రలోని నాందేడ్ లో జరగనున్న బీఆర్ఎస్ సభకు కేసిఆర్ వెళ్తారు.