Coconut Water: కొబ్బరినీళ్లు తాగితే మంచిదని వైద్యులు చెప్పడంతో ఎక్కువ మంది వాటినే తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరినీళ్లు తీసుకుంటున్నారు. దీంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. కొబ్బరినీళ్లలో ఉండే పోషకాలతో మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే అనర్థాలే. వాటిని కూడా మితంగా తీసుకుంటేనే ప్రయోజనాలు దక్కుతాయి. ఏదైనా మితంగా అయితేనే ఫలితం ఇస్తుంది. అతిగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తడం ఖాయం. అందుకే ఏ విషయంలో అయినా అతి అనేది పనికి రాదనే విషయం గర్తుంచుకోవాలి. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

శరీర పోషణకు కొబ్బరి నీళ్లు శ్రేయస్కరమని భావించి ఇటీవల కాలంలో అందరు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అందుకే మంచి ఆహారాల వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే బలమైన ఆహారం తీసుకుని దేహానికి సమస్యలు లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పొటాషియం పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొబ్బరినీళ్లలో మోనోశాకరైడ్ లు పులియబెట్టే ఒలిగోశాకరైడ్ లు పాలియోల్స్ ఉంటాయి.
శరీరంలో మూలకాల పరిమాణం పెరిగితే శరీరం నుంచి నీటిని పీల్చుకుంటాయి. దీంతో వాంతులు, విరేచనాలు, గ్యాస్ సమస్యలు వేధిస్తాయి. కొబ్బరినీళ్లు రోజు తాగకుండా అప్పుడడప్పుడు తాగితేనే మంచిది. మధుమేహంతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తరచుగా కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది. ఇందులో చక్కెరతో పాటు అధిక కేలరీల శక్తి ఉండటంతో చక్కెర స్తాయిలు పెరిగేందుకు దోహదపడుతుది. అందుకే కొబ్బరినీళ్లు కొంచెంగా తీసుకోవడమే ఉత్తమం. కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు కూడా పెరిగే అవకాశాలుంటాయి.

కొబ్బరినీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి హాని చేస్తుంది. రక్తపోటు స్థాయి ఉన్నట్లుండి పడిపోవచ్చు. దీంతో అనారోగ్య సమస్య ఏర్పడవచ్చు. ఫలితంగా అతిసారం, నీరసం వంటి సమస్యలు రావచ్చు. అందుకే కొబ్బరినీళ్లు అతిగా కాకుండా మితంగా తీసుకుంటేనే ప్రయోజనాలున్నాయి. దీంతో మనం కూడా కొబ్బరి నీళ్లు ఎప్పుడు కాకుండా కొంచెంగా తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించుకుని నడుచుకుంటే మంచిది.