https://oktelugu.com/

తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవీ దక్కనుందా?

కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. మోడీ సర్కార్ బంపర్ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి రావడంతో బీజేపీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. అయితే బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే ముద్ర తొలి నుంచి ఉంది. దీంతో ఈ ముద్రను చేరిపేసేందుకు బీజేపీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిసారించింది. దక్షిణాదిలో బీజేపీ బలపడేందుకు అవకాశం ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది. దీంతో అధిష్టానం ఆదేశాలతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 28, 2020 / 02:39 PM IST
    Follow us on


    కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. మోడీ సర్కార్ బంపర్ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి రావడంతో బీజేపీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. అయితే బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే ముద్ర తొలి నుంచి ఉంది. దీంతో ఈ ముద్రను చేరిపేసేందుకు బీజేపీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిసారించింది. దక్షిణాదిలో బీజేపీ బలపడేందుకు అవకాశం ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది. దీంతో అధిష్టానం ఆదేశాలతో కేంద్రమంత్రులు సైతం తరుచూ తెలంగాణలో పర్యటిస్తూ స్థానిక నేతల్లో జోష్ నింపుతున్నారు.

    Also Read: కేంద్రం సవతి ప్రేమ.. తెలుగు రాష్ట్రాల చేతికి చిప్ప

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. అయితే నాటి నుంచి కూడా తెలంగాణలో బీజేపీ బలపడేందుకు శతవిధలా ప్రయత్నిస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణలో బలపడేందుకు సన్నహాలు చేస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో గెలిచి సత్తాచాటడంతో అధిష్టానం తెలంగాణపై దృష్టిసారించింది. పక్కా ప్రణాళికతో వెళితే తెలంగాణలో బీజేపీ మరింత బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అధిష్టానం గుర్తించింది. ఈమేరకు 2024 ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతోంది.

    బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో స్థానిక నేతలు సైతం అధికార టీఆర్ఎస్ పై దూకుడుగా వెళుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే బీజేపీ నేతలే సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళుతూ బీజేపీ నేతలు అందరి అటెన్షన్ తమవైపు తిప్పుకుంటున్నారు. మరోవైపు అధిష్టానం సైతం తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ను నియమించింది. ఆయన కూడా తొలి నుంచి సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పై దూకుడుగా వెళుతున్నారు. టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా బండి సంజయ్, స్థానిక నేతలు పోరాటాలు చేస్తున్నారు.

    Also Read: బీజేపీపై బాబు ఆశలు గల్లంతేనా?

    దీంతో బీజేపీ అధిష్టానం తెలంగాణ నేతలకు కేంద్రంలో ప్రాధాన్యం కల్పించేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే తెలంగాణ వ్యక్తిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనుందని సమాచారం. అంతేకాకుండా బీజేపీ జాతీయ కార్యవర్గంలోనూ తెలంగాణ నేతలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం మురళీధర్ రావు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్ రావు జాతీయ కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు.

    దీంతో రాష్ట్రానికి రెండు పదాధికారుల పదవులు(ఆఫీస్ బేరర్లు) మరో రెండు కార్యవర్గ పదవులతోపాటు మోర్చాకు సంబంధించి కీలక పదవి తెలంగాణ కేటాయించునున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం తెలంగాణ నేతలకు పదవుల పంపకం చేపట్టనుండటంతో ఆశావహులు ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పదవీ ఎవరికీ దక్కుతుందనే ఆసక్తి బీజేపీ శ్రేణుల్లో నెలకొంది.