Homeఎంటర్టైన్మెంట్ఒక్క డైలాగ్‌ లేకుండా ఆర్జీవీ.. ‘మర్డర్’ ట్రైలర్

ఒక్క డైలాగ్‌ లేకుండా ఆర్జీవీ.. ‘మర్డర్’ ట్రైలర్


వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వరుస సినిమాలు తీస్తూ, డబ్బులు సంపాదించడంలో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా ‘పవర్ స్టార్’ అనే మూవీతో తెలుగు రాష్ట్రాల్లో అగ్గిరాజేసే ప్రయత్నం చేశాడు ఆర్జీవీ. దాదాపు రెండు వారాల పాటు పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతూ తన మూవీకి ప్రచారం తెచ్చుకున్నాడు. తీరా 40 నిమిషాల నిడివి కూడా లేని పేరడి సినిమాను రిలీజ్‌ చేసిన వర్మ చివరి ఎనిమిది నిమిషాల్లో తానే కనిపించాడు. రియల్ ‌లైఫ్‌లో పవన్‌కు తాను ఇవ్వాలనుకున్న మెసేజ్‌ను సినిమా ద్వారా ఇచ్చాడు. ఈ వివాదం ముగిసిందని అనుకుంటున్న తరుణంలో ఆర్జీవీ మరో బాంబ్‌ పేల్చాడు. వాస్తవ ఘటనలు, రియల్‌ లైఫ్ క్యారెక్టర్లతో సినిమాలు తీయడంలో ఆరి తేరిన రాము.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లొండ ప్రణయ్‌ హత్యోదంతం ఆధారంగా తీస్తున్న ‘మర్డర్’ కుటుంబ కథా చిత్రం మూవీ ట్రైలర్ను ఈ రోజు రిలీజ్‌ చేశాడు.

Also Read: భల్లాలదేవతో బాలీవుడ్‌ క్వీన్‌ జోడీ

అయితే ఈ మూవీకి ఆర్జీవీ దర్శకత్వం వహించడం లేదు. ఆనంద్‌ చంద్ర ఈ మూవీతో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్‌ అవుతున్నాడు. నట్టి కరుణ, నట్టి క్రాంతి ప్రొడ్యూసర్లు. అమృత పాత్రలో సాహితి అవాంచ నటిస్తోంది. ఆమె తండ్రిగా శ్రీకాంత్‌ అయ్యంగార్, తల్లిగా గాయత్రి భార్గవి నటిస్తున్నారు. ప్రణయ్‌-అమృత ప్రేమ, పెళ్లి.. కులాంతర వివాహం నచ్చక… అమృత తండ్రి… ప్రణయ్‌ను హత్య చేయించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అమృత తండ్రి మారుతీ రావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైలర్ ప్రకారం ఈ ఎపిసోడ్‌ వరకూ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Also Read: డబ్బులు కోసం హీరోయిన్లందరూ.. !

ఆర్జీవీ రీసెంట్‌గా తీసిన చిత్రాలతో పోలిస్తే ‘మర్డర్’ మేకింగ్ ఆసక్తి కలిగిస్తోంది. 2 నిమిషాల 13 సెకండ్ల నిడివితో ఉన్న ట్రైలర్లో ఒక్క డైలాగ్‌ కూడా లేదు. కానీ, తాను చెప్పాలనుకున్న విషయాన్ని బ్యాక్‌గ్రౌండ్‌ క్యాప్షన్‌తో… చూపించాలనుకున్నది పర్ఫెక్ట్‌ పిక్చరైజేషన్‌తో ట్రైలర్తోనే క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. యావత్‌ భారతదేశానికి షాక్‌ ఇచ్చిన ఒక ఘటన ఆధారంగా క్యాప్షన్‌తో మొదలైన ట్రైలర్లో పాత్రలను పరిచయం చేసిన తర్వాత అసలు కథను చెప్పే ప్రయత్నం చేశాడు. పిల్లలని ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలని కనగలం గాని వాళ్ల మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి… అనే క్యాప్షన్స్‌తో కథను ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, మూవీ రిలీజ్‌ డేట్‌ను ఆర్జీవీ ఇంకా అనౌన్స్‌ చేయలేదు.

MURDER Official Trailer Telugu | RGV |  RGV's #MURDER | Latest 2020 Movie Trailers | Ram Gopal Varma

 

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version